నాడు-నేడు పనులు నాణ్యత ఉండాలి పనులను పరిశీలించిన కలెక్టర్, కమిషనర్

చిత్తూరు జిల్లా:తిరుపతి:ప్రభుత్వ పాఠశాలలు  ప్రయివేటు పాఠశాలకు ధీటుగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న నాడు-నేడు పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తో కలసి స్థానిక ఎస్.పి.జె.ఎన్. ఎం. స్కూల్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. నాడు-నేడు లో భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులను కమిషనర్ గిరీషా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రయివేటు పాఠశాలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, సమూల మార్పులు చేయిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణము, చిన్న మరమ్మత్తు లు, పెయింటింగ్స్, త్రాగేందుకు ఆర్ ఓ వాటర్ ఏర్పాటు, ఫ్యాన్లు ఏర్పాటు వంటివి చేస్తున్నారన్నారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా జాగ్రత్త పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.    కమిషనర్ గిరీషా ,మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో 22 పాఠశాలలను సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తిన్నామన్నారు. ప్రతి పాఠశాల

About The Author