పైన చూస్తే కూరగాయలు.. కొబ్బరికాయలు తరచిచూస్తే గంజాయి గుప్పు!
తూర్పుగోదావరి జిల్లా:పైన చూస్తే కూరగాయలు.. కొబ్బరికాయలు తరచిచూస్తే గంజాయి గుప్పు!
రూ. 27 లక్షల విలువైన సరకు స్వాధీనం
పదిమంది,అరెస్టు,పైనచూస్తేకూరగాయలు.. కొబ్బరికాయలు,తరచిచూస్తే గంజాయి గుప్పు!నక్కపల్లిలో స్వాధీనం చేసుకున్న గంజాయి,ప్యాకెట్లు,నిందితులతోపోలీసులు,హుకుంపేట, జిల్లాలో శనివారం రెండు ప్రాంతాల్లో 1364 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 27 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులకు సంబంధించి పది మందిని అరెస్టు చేశారు. మన్యంలోని హుకుంపేట సమీపంలో దిగుడుపుట్టు వంతెన వద్ద బొలేరో జీపు, రెండు ద్విచక్ర వాహనాల్లో కూరగాయల కింద తరలిస్తున్న 700 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు హుకుంపేట ఎస్సై అప్పలనాయుడు తెలిపారు. దీని విలువ రూ. 14 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. వీరి వద్ద రూ. 500 నగదు, అయిదు చరవాణులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ఒడిశాకు చెందిన ఉపేంద్ర శెట్టి, జన్నికదాసు శెట్టి, దాసు, గసీరం శెట్టి, గణేష్, పాంగి సుక్కదేవ్, సునీల్‌కుమార్ శెట్టి, బిశ్వనాథ్ శెట్టిగా గుర్తించామన్నారు.బిహార్ తరలిస్తుండగా