వై.ఎస్.ఆర్ కాపు నేస్తం
తిరుపతి, జూన్ 24: కుల,మత, పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు కె. నారాయణ స్వామి తెలిపారు. బుధవారం ఉదయం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వై.ఎస్.ఆర్ కాపు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్.డి.ఓ కార్యాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు కె. నారాయణ స్వామి, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్, ఎన్. రెడ్డప్ప, చిత్తూరు, తంబళ్ళ పల్లి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, ద్వారకనాద్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారని, పేద వారికీ సేవ చేయాలనే తపన ముఖ్య మంత్రి గారికి కలదని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీనితో పాటు సెంటు భూమి లేని వారికి కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త మాట్లాడుతూ జిల్లా లో వై.ఎస్.ఆర్ కాపు నేస్తం ద్వారా రూ.8,218 మంది మహిళా లబ్ది దారులకు రూ.12.32 కోట్లు పంపిణి చేయనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏ.జే.సి వి.ఆర్ చంద్ర మౌళి. బిసి కార్పోరేషన్ ఈడి చలమయ్య, బిసి కార్పోరేషన్ ఏ.ఈ.ఓ బాబు రెడ్డి,ఇతర లబ్ది దారులు పాల్గొన్నారు.