డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలలో బయట పడిన కాలం చెల్లిన మందులు
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న GRS మందుల దుకాణంలో కాలంచెల్లిన మందులను విక్రయిస్తూ పట్టుబడ్డ యజమానిని నెలలు గడుస్తున్నా ఇంతవరకూ అతని మీద మాత్రం చర్యలు అధికారులు తీసుకోలేదు స్వయానా డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి మందుల దుకాణంలో తనిఖీలు చేసి కాలం చెల్లిన 13 రకాల మందులు పట్టుబడ్డాయని స్వయంగా వెల్లడించినా సదరు యజమాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు 5 సంవత్సరాల పసిపాపకు కాలం చెల్లిన సిరప్ ను అమ్ముతూ షాపు యజమాని పట్టుబడ్డాడు.
GRS మెడికల్ షాప్ లో పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించగా 13 రకాల కాలం చెల్లిన మందులు లభ్యమైనట్లు తెలిపారు. అంతేకాక బిల్ బుక్స్, H1 కు సంబంధించిన ఎటువంటి మెయిన్ టెన్ చేయట్లేదు దింతో మేము ప్రతిఒక్కటి రికార్డ్ పరంగా రిజిస్టర్ లో పొందుపరచి పై ఉన్నతస్థాయి అధికారులకు రిపోర్టును అందజేస్తామని వారి ఆదేశాల మేరకు మెడికల్ షాప్ యజమాని పై చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పక్టర్ కేశవ రెడ్డి మీడియాకు తెలిపారు. కానీ నెలలు గడుస్తున్నా ఇంతవరకు చర్యలు శూన్యం అని అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని వినికిడిలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.