అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జులై 15 వరకు ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై బ్యాన్ విధిస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇండియా​ నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని వెల్లడించింది. వీటిలో డీజీసీఏ పర్మిషన్ పొందిన.. గూడ్స్ రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివరించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని,వెల్లడించింది.రోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.సడలింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించారు. మే 6 నుండి వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలలాకు తరలించిన విషయం తెలిసిందే.

About The Author