అమెరికా ఆరోగ్య సంస్థ-ఈలక్షణాలు ఉన్నా కరోనా సోకినట్లే
కరోనా లక్షణాలపై అమెరికా ఆరోగ్య సంస్థ సంచలనవిషయాలనువెల్లడించింది. కరోనాను గుర్తించేందుకు ఇప్పటి వరకు 8 లక్షణాలను పరిగణలోకి తేసుకుంటుండగా కొత్తగా మరో 3 లక్షణాలను గుర్తించినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు చలి జ్వరం, దగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండడం, అలసట, శరీరం మొత్తం నెప్పులు, తల నెప్పి, రుచితో పాటు వాసన తెలియకపోవడం, గొంతు మంట వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా గుర్తించేవారు. అయితే ఇప్పుడు డయేరియా, ముక్కు కారడం, వికారం వంటి లక్షణాలు కూడా కరోనా బాధితుల్లో కనిపిస్తున్నట్లు అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్థ(సీడీసీ) వెల్లడించింది.కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది.
అధికారిక వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. కరోనాపై మరింత పరిశోధనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనుగొనడమే కాకుండా వాటిని తమ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని సీడీసీ తెలిపింది.