ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే
దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో ఇప్పుడిక అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ లాక్ 2ను అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.జూలై 1 నుంచి 31 వరకూ అన్ లాక్ 2 అమల్లో ఉండనుంది. అన్ లాక్ 2లో మార్గదర్శకాల్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించింది.జూలై 1 నుంచి 31 వరకూ అన్ లాక్ 2 అమల్లో ఉండనుంది. అన్ లాక్ 2లో మార్గదర్శకాల్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించింది.ఈ అన్ లాక్ సిరీస్ లో రెండో అంకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించింది ప్రభుత్వం. అన్ లాక్ 2 ప్రకారం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, జిమ్ లు, మెట్రో రైలు సర్వీసులు మరో నెల రోజుల పాటు మూసివేసే ఉంటాయి. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది,స్కూళ్లు, కాలేజీలు , కోచింగ్ సెంటర్లు జూలై 31 వరకూ మూసివేత,సినిమాహాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, బార్లు, సమావేశమందిరాలు మూసివేత,సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుకలపై నిషేధం కొనసాగింపు,దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు పరిస్థితిని బట్టి పెంచే అవకాశం
ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 14 వేల 285 పరీక్షలు చేయగా 845 కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 9 లక్షల 32 వేల 713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16 వేల 97 కు చేరుకుంది. రానున్న 3 నెలల్లో ఇంటింటికీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.