రౌడీషీటర్ వికాస్ దూబే ఇల్లు కూల్చివేత 

గాలింపు చర్యల్లో పాల్గొన్న 25ప్రత్యేక బృందాలు,పోలీసుల మృతిని సవాలుగా తీసుకున్న యూపీ ఉన్నతాధికారులు

వికాస్ ఆచూకీ చెబితే రూ. 50,000 రివార్డు ప్రకటన

500 మొబైల్ ఫోన్ల డాటాను విశ్లేషిస్తున్న నిఘా విభాగం

నా కుమారున్ని కాల్చేయండి’ దుభే తల్లి స్పందన,ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన నరరూప రాక్షసుడు వికాస్ దూబే ఇంటిని జిల్లా అధికారులు నేడు కూల్చి, నేలమట్టం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు ఈ సంఘటన విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఎన్​కౌంటర్​లో పోలీసుల మృతిని సవాలుగా తీసుకున్నారు. కాన్పుర్ ఐజీ మెహిత్ అగర్వాల్ మాట్లాడుతూ..దూబేను పట్టుకునేందుకు 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వికాస్​ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు వివరించారు.

నిందితుల వద్ద ఏకే 47 తుపాకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వికాస్​కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తే రూ.50,000 రివార్డు అందిస్తామని అధికారులువెల్లడించారు.

ఇప్పటికే నిఘా విభాగం 500 మొబైల్ ఫోన్ల డాటాను విశ్లేషిస్తోంది. వాటిలోని సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా…ఎనిమిది మంది పోలీసులను చంపి తన కుటుంబ అప్రతిష్ఠకు కారణమైన వికాస్ దూబేను కాల్చి చంపేయాలని అతని తల్లి స్పష్టం చేస్తోంది. అతను చేసింది చాలా పెద్ద నేరమని.. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకుంటే క్షమించవద్దని కోరింది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పుర్​కు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామన్నారు. 

  ఇదీ జరిగింది..

రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లగా..ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉండటం గమనార్హం.

About The Author