తిరుమలలో మళ్లీ భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేసే ఆలోచనలో T.T.D..?


ఆంధ్రప్రదేశ్ ‌లో కరోనావైరస్ కల్లోలం సృష్టిస్తోంది… రోజూ 2 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అయితే.. టెస్ట్‌లు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి.. మరోవైపు.. కరోనా వైరస్ ఎఫెక్ట్ మరోసారి శ్రీవారి దర్శనాలపై పడేలా కనిపిస్తోంది.. కరోనా కేసులు తిరుపతి కొండను కుదిపేస్తున్నాయి.. తిరుమలలో పరిస్థితులు రోజురోజుకీ తీవ్రంగా మారుతుండడంతో.. భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేసే ఆలోచనలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఇప్పటికే శ్రీవారి ఆలయానికి చెందిన 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా రావడంతో పాటు పెద్ద జియ్యంగార్‌ కూడా కరోనాబారినపడడంతో దర్శనాలు నిలిపివేయాలని పాలకమండలి భావిస్తోంది..దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తిరుమలలో దర్శనాలు తిరిగి ప్రారంభించిన తర్వాతే కరోనా కేసులు పెరిగాయని.. టీటీడీ ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు.. ఇప్పటి వరకు తిరుమలకు వచ్చిన భక్తులు ఎవ్వరూ కరోనాబారిన పడకపోయినా.. పూజారుల నుంచి ఉద్యోగుల వరకు అనేకమంది కరోనాబాధితులుగా మారిపోయారు. అర్చకులను మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దర్శనాలు కొనసాగిస్తే మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందని టీటీడీ భావిస్తోంది. దీంతో.. తాత్కాలికంగా దర్శనాలు నిలిపివేసి.. శ్రీవారికి ఏకాంతంగా పూజాకైంకర్యాలు నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది.

About The Author