తితిదే CPS ఎంప్లాయిస్ అసోసియేషన్
తిరుపతి:కరోనా పాజిటివ్ వచ్చి శ్రీనివాసం/మాధవం లో ఉన్న మన తితిదే ఉద్యోగులకు అందుతున్న సౌకర్యాలపై ఈ రోజు వారితో మాట్లాడడం జరిగింది. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది.
డ్యూటీ డాక్టర్ రోజు వచ్చి హెల్త్ చెక్ చేయడం లేదు అని చెప్పారు.
భోజనం సరిగా లేదని, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం లేదని చెప్పారు.
బస చేసిన రూంను మరియు పరిసర ప్రాంతాలను క్లీన్ చేయడం లేదని, వేడి నీళ్లు రావడం లేదని చెప్పారు.
10 నుండి 14 రోజులు క్వారంటైన్ ముగించు కొన్ని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో కరోనా టెస్ట్ చేయకుండా ఇంటికి పంపిచేస్తున్నారని,దీని కారణంగా కుటుంబసభ్యులకు వచ్చే ఆస్కారం ఉందని చెప్పారు.
పై తెలిపిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోని వెళ్లి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని వారిలో మనోధైర్యం నింపడం జరిగింది. వారికి మనమందరం తోడుగా ఉన్నామన భరోసా, మనోధైర్యం నింపడానికి ఈ రోజు తితిదే CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండ్లు (ఆపిల్,ఆరంజ్,బత్తాయి,అరటిపండ్లు) మరియు బ్రేడ్, జాం ప్యాకెట్లను కిట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిని మొత్తం అక్కడ విధులు నిర్వహిస్తున్న AEO(G) శ్రీ K.N.రామకృ