ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కు కరోనా నెగటివ్..!
గత కొన్ని రోజులుగా చెన్నై ఎంజిఎం ఆసుపత్రి లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పై పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందన్న వార్తలు వచ్చాయి. అందరు ఆనందపడే లోపే..ఆ సంతోషం ఆవిరైపోయింది.. ఆయన ఆరోగ్యం మరింత విషమిస్తోందని వైద్యులు వెల్లడించారు.. ఆయన శరీరం లో కరోనా ఉదృతి ఎక్కువ అవుతుండడం తో.. వెంటిలేటర్ ను అమర్చి శ్వాస కు ఇబ్బంది లేకుండా చేసారు. అది సరిపోక పోవడం తో ఎక్మో సపోర్ట్ ను కూడా అందించారు.. మరో వైపు.. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆయన అభిమానులు , శ్రేయోభిలాషులు సామూహిక ప్రార్ధనలు చేసారు.
ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది.. ప్రార్ధనలు ఫలించాయి.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కు కరోనా నెగటివ్ వచ్చింది.. అయితే… కొన్ని రోజులు ఆయనకు చికిత్సను కొనసాగించనున్నారు… ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు.. తాజాగా చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది.. ఈ విషయాన్నీ ఆయన కుమారుడు తెలిపారు. గత నెల 5వ తారీఖున కరోనా తో ఆసుపత్రి లోకి చేరిన బాల సుబ్రమణ్యానికి తొలుత చికిత్స మంచి ఫలితాలనే ఇచ్చిన క్రమం గా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ నెల 14 వ తేదీ నాటికి ఆయన పరిస్థితి విషమించింది. ఈరోజు జరిగిన కొరోనా టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ప్రపంచం లో ఉన్నటువంటి అందరూ ప్రార్థనవల్ల ఆయన త్వరగా కోలుకుంటారని చరణ్ సంతోషం వ్యక్తం చేసారు.