రాయలసీమ కోస్తాకు వర్ష సూచన..
మహారాష్ట్ర నుంచి లక్షద్వీప్ వరకు విస్తరించిన ఉపరితల ద్రోణిలో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం విలీనమైంది. అలాగే కోస్తాంధ్ర తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో మంగళవారం రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో ఓ మాదిరి జల్లులు పడ్డాయి. బుధవారం కూడా రాయలసీమలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నెల 11న కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు, 12న రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శ్రీశైలం డ్యాంకు వరద తీవ్రత కొనసాగుతోంది.ప్రస్తుతం 45,560 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.