ఈ వేళ పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు

కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతోంది. వీటికి తోడు మరో 80 రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపగా అనుమతి లభించడంతో రైళ్లు పట్టాలెక్కాయి. ఇవాళ్టి నుంచి నడవున్న సర్వీస్‌లలో ఎనిమిది డైలీ, వీక్లీ ట్రైన్లు తెలంగాణ, ఏపీ నుంచి ఢిల్లీ, చెన్నై, ఓకా, దర్భంగా సహా పలు ప్రాంతాలకు నడువనున్నాయి. రైల్‌ నంబర్‌ 07007 సికింద్రాబాద్ నుంచి దర్భంగా వెళ్తుంది. ప్రతీ మంగళవారం, శనివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.07008 దర్భంగా నుంచి సికింద్రాబాద్‌కు గురువారం, శుక్రవారం నడుస్తుంది.

08517 నంబర్‌ రైలు కోర్బా నుంచి విశాఖపట్నం వస్తుంది. 08518 విశాఖపట్నం నుంచి కోర్బాకు ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07563 హైదరాబాద్ నుంచి పర్భనీకి ప్రతీ రోజూ వెళ్తుంది. 07564 పర్భనీ నుంచి హైదరాబాద్‌కు నిత్యం నడువనుంది. 02615 చెన్నై నుంచి న్యూఢిల్లీకి, రైలు నెంబర్ 02616 న్యూ ఢిల్లీ నుంచి చెన్నైకి ప్రతీ రోజూ వెళ్తుంది. 02669 చెన్నై నుంచి చాప్రాకు సోమవారం, శనివారం.. 02670 ఛాప్రా నుంచి చెన్నైకి సోమవారం, బుధవారం నడుస్తాయి. రైలు నంబర్ 02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురువారం, శనివారం, 02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి. 02509 బెంగళూరు నుంచి గౌహతికి బుధవారం, గురువారం, శుక్రవారం, 02510 గౌహతి నుంచి బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తాయి.08401 నంబర్‌ గల ట్రైన్‌ ఖుర్దా రోడ్ నుంచి ఓఖాకు ప్రతీ ఆదివారం, 08402 ప్రతీ బుధవారం నడవనుంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో ఇండియన్‌ రైల్వే రైళ్లను నిలిపివేసింది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును చేసింది. మొదట ఆగస్టు 11 వరకు.. అనంతరం సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అన్ని సర్వీసులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌లాక్‌లో భాగంగా మెట్రో సర్వీసులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో రైల్వేశాఖ మరో 80 ట్రైన్లు నడిపేందుకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల అనుమతి రావడంతో వాటిని పట్టాలెక్కించింది. ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్‌ను సైతం ప్రారంభించింది.

About The Author