రౌడీ షీటర్లు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే నగర బహిష్కరణ

 

 

నగరంలో హింసకు ఎటువంటి ఆస్కారం లేదు.రౌడీ షీటర్లు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా నగర బహిష్కరణ చేస్తాం. గ్రూపిజం, రౌఢీయిజం లకు తావులేదు. అలా పాల్పడితే వీరిని కూడా బహిష్కరిస్తాం. గతంలో నేర చరిత్ర గలవారిపై ప్రత్యేకమైన నిఘా.యువతను తప్పుదోవ పట్టించేవారిని కూడా వదిలిపెట్టం. రౌడీ షీటర్లపై 24×7 నిఘా.మారణాయధాలు కలిగి ఉండినా, కలిగినట్టు సమాచారం వచ్చిన కఠిన చర్యలుతీసుకుంటాం.  ప్రజలుభయబ్రాంతులకు గురికావద్దు.ప్రజలు ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి, సకాలములో చర్య తీసుకుంటాం.

విద్యాలయాల పరిసర ప్రాంతాలలో కూడా ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు.

నగరంలో అవసరమైన ప్రతి చోట అదనంగా సి.సి కెమెరాల ఏర్పాటు.

గ్రూపిజం, గుండాయిజం పాల్పడే వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేస్తాం.

ప్రజలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై విలువైన సమాచారం ఇచ్చి సహకరించండి.వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగిన వెంటనే జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ముద్దాయిలను 24 గంటలలోనే వెస్ట్ డి.యస్.పి నరసప్ప గారి అధ్వర్యంలో కేసును చేధించి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది.   20-09-20 నాడు, గిరిపురం, మెయిన్ రోడ్డు నందు, జ్యోతి జంక్షన్ వద్ద  జరిగిన రౌడీ షీటర్ దినేష్ హత్య కాబడిన వివరములు.

గత సంవత్సరము 21-12-2019 నాడు హత్య కాబడిన బెల్ట్ మురళి కేసులో. దినేష్ (A11 మరియు రౌడీ షీటర్) కూడా నేరస్తుడు. బెల్ట్ మురళి అన్న కుమారుడైన 1.వినయ్(A1), తన బాబాయిని చంపిన దినేష్ పై కక్ష పెంచుకొని, తన స్నేహితులైన 2. కోలా సాయి కృష్ణ (A2), 3.వేపి రెడ్డి శ్రీను రెడ్డి(A3), 4.S. సాయి కృష్ణ(A4), 5. కోసల శివ కుమార్ (A5) లతో కలసి, హత్య జరిగిన రోజు ఉదయం నుండి, హతుడైన దినేష్ కదలికలు గమనిస్తూ..ఆ రోజంతా పై వారందరూ ఆయుర్వేద కాలేజీ గ్రౌండ్ నందు చేరి, దినేష్ ను చంపుటకు పథకం వేసినారు.

అందులో భాగంగా 20.09.2020 రాత్రి సుమారు 9-30 PM గంటలకు గిరిపురం మెయిన్ రోడ్డులో,తన ఇంటి ముందు నిలబడి ఉన్న దినేష్ ను, రెండు Honda Activa స్కూటర్ లపై, పై ఐదు మంది చుట్టుముట్టి, వినయ్, శ్రీను రెడ్డి మరియు సాయి కృష్ణ ల వద్ద ఉన్న కత్తులలో విచక్షణారహితంగా, దినేష్ ను శరీరమంతా పొడిచి, చనిపోయినాడని, నిర్దారించుకొని, సంఘటన స్దలము నుండి పారిపోయినారు. రెండు కత్తులను మహతి పరిసర ప్రాంతములందు పారేసి, ముందుగా అనుకొన్న ప్రకారం దామినేడు వరకు వెళ్ళి, అక్కడ రెండు స్కూటర్ లను మరొక కత్తిని పడవేసి, అక్కడ ఆటోలో వేచి ఉన్న 6.గౌతం @ సల్మాన్ రాజు(A6), మరియు 7.సురేష్ @ పప్పు @ ఎర్రోడు(A7)  లతో కలసి పారిపోయినారు.

హత్య చేసిన ముద్దాయిలను తిరుపతి నుండి పారిపోవుటకు సహకరించినందున పై  గౌతం @ సల్మాన్ రాజు, మరియు సురేష్ @ పప్పు @ ఎర్రోడు లను ముద్దాయిలుగా చేర్చడమైనది.అందుపై తిరుపతి West P.S. ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ దినం అనగా 22-09-2020, నాడు తిరుపతి ఆయుర్వేద కళాశాల గ్రౌండ్ వద్ద పై ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి యొక్క నేర ఒప్పుదల మేరకు, హత్య చేయుటకు ఉపయోగించిన రెండు హోండా ఆక్టివా స్కూటర్ లను (1) AP 39BZ 9962 (2) AP 03 A3626, ఆటొ AP03TH1087 లను మరియు నేరానికి ఉపయోగించిన 3 కత్తులు, పలు ప్రదేశాల నుంచి స్వాధీనపరచుకోవడమైనది.    తిరుపతి వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధి నందు 42 మంది రౌడీ షీటర్ లు ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరినీ మంచి నడవడిక కోసం Bound Over చేసియున్నాము.

ప్రస్తుతం ఈ కేసులో ఉన్న ఏడుగురిపై ఎటువంటి రౌడీ షీట్స్ లేవు. ఈ కేసులో ఓపెన్ చేసి నిఘా ఉంచుతాము.              ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సబ్ డివిజన్ డి.యస్.పి నరసప్ప వారి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం వెస్ట్ సి.ఐ శివ ప్రసాద్, యస్.వి.యు సి.ఐ రవీంద్రనాథ్, వెస్ట్ యస్.ఐ లు ప్రవీణ్ కుమార్, చలపతి, యం.ఆర్ పల్లి యస్.ఐ నరేంద్ర, వెస్ట్ పి.యస్ ఐ.డి పార్టీ సిబ్బంది గోపాల్, వేంకటేశ్వర రావు, చిరంజీవి, రమేష్ లు  HC, మరియు PC లు, మరియు యస్.వి.యు పి.యస్ ఐ.డి పార్టీ PC నాగరాజు వారిని జిల్లా యస్.పి గారు అభినందించారు

 

About The Author