ఇకపై ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌లు…


ఇకపై ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది.

ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటి మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. పౌరులకు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. దీంతో వాహనదారులు ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ పొందడం, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ (డిఎల్), వాహనాల నమోదు (ఆర్సి) మరియు డాక్యుమెంట్ అడ్రస్ మార్చడం వంటి ఆరు రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.

కాగా ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జ్ వంటి సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి.

డైవింగ్ లైసెన్స్ పునరుద్దరణ మరియు ఆర్సి సంబంధిత ఆన్లైన్ సేవలను ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) పరిధిలోకి తీసుకురావాలని రహదారి మరియు రవాణా మంత్రిత్వ శాఖ, ఐటి మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. కొందరు డ్రైవర్లు మరియు వాహనాల యజమానులు పొందుతున్న నకిలీ మరియు మల్టిపుల్ లైసెన్సులు, డాక్యుమెంట్లను తొలగించడమే లక్ష్యంగా రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన చేసింది.కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటికారాకుండానే ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆధార్ అథెంటికేషన్ సాంఘిక సంక్షేమం, ఇన్నోవేషన్, నాలెడ్జ్‌లో భాగంగా ఈ తాజా నిబంధనలను చేర్చింది.

రహదారి మరియు రవాణా మంత్రిత్వ శాఖ మునుపటి ప్రతిపాదన ప్రకారం కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఎంటిటీలను అభ్యర్థించడం, లీకేజీని నివారించడం ద్వారా ఆధార్ అథెంటికేషన్ను అనుమతించవచ్చు. అంతేకాక ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం మరియు వారికి మెరుగైన సేవలకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కింది.
కాగా డ్రైవింగ్ లైసెన్స్ల కోసం ఆధార్ను తప్పనిసరి చేయాలని రవాణా మంత్రిత్వ శాఖ 2018లోనే నిర్ణయించింది. కానీ పౌర సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఆధార్ను ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా స్వచ్ఛందంగా ఉపయోగించుకునే వీలు కల్పించే సవరణ బిల్లును 2019లో పార్లమెంటులో ఆమోదించారు.

About The Author