కరిముల్లా…నువ్వు కలెక్టర్ అవుతావు: సోను సూద్
దేశానికి అపర కర్ణుడిలా కనిపిస్తున్నాడిప్పుడు
సోను సూద్ అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ
ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తున్నాడు.
లాక్ డౌన్ టైంలో సోను చేసిన సహాయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి,కర్రసాము చేస్తున్న ఒక వృద్ధురాలిని చేరదీసాడు, పొలం దూన్నుతున్న ఇద్దరు ఆడపిల్లల విషయంలో వెంటనే స్పందించి వారికి ట్రాక్టర్ ని అందజేసాడు. ఇలా ప్రభుత్వాల కంటే వేల రేట్లు వేగంగా స్పందిస్తున్నారు. సహాయం చేయడంలో అందరికంటే ముందు నడిచాడు.
తాజాగా…
కరిముల్ల అనే ఒక విద్యార్థి తనకు వచ్చిన మార్కుల లిస్ట్ ను అటాచ్ చేసి నేను క్లాస్ లో టాపర్ని. కానీ నాకు చదువుకునేంత ఆర్థిక స్థోమత లేదు.
తన చదువు కోసం సాయం చేయాలంటూ సోనూ సూద్ కు విజ్ఞప్తి చేశాడు. కరిముల్లా చేసిన విజ్ఞప్తికి సోను సూద్ వెంటనే స్పందించాడు. ఆయన కోసం సరత్ ఐఏఎస్ అకాడమీతో మాట్లాడి వెంటనే కరిముల్లా కు సీటు ఇప్పించడంతో పాటు, అందుకు సంబంధించిన అన్ని ఆర్థిక వనరులు సమకూర్చాడు.
షేక్ కరిముల్లా చేసిన ట్వీట్ కు సోనూసూద్
సమాధానం ఇస్తూ…నువ్వు కలెక్టర్ అవుతావు అందుకోసం కావలసిన ఏర్పాట్లు చేశాను. ఐఏఎస్ సరత్ అకాడమీతో మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. కరిముల్లాకు సాయం చేసేందుకు సరత్ ఐఏఎస్ అకాడమీ వారు ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోను సూద్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది.