నవంబరు 2 నుంచి ఏపీలో తెరుచుకోనున్న పాఠశాలలు..


నవంబరు 2 నుంచి ఏపీలో తెరుచుకోనున్న పాఠశాలలు
సిలబస్, సెలవులు తగ్గిస్తామన్న మంత్రి
ప్రతి స్కూల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడి

నవంబరు 2న పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ సర్కారు సమాయత్తమవుతోంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా కాదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

నవంబరు 2 నుంచి అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నడుస్తాయని, అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి పాఠశాలకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని, విద్యార్థులకు ప్రత్యేకంగా కరోనా క్లాసు ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే అనేక నెలలు గడిచిపోయినందున ఈ విద్యాసంవత్సరాన్ని కుదిస్తున్నామని, అందువల్ల సిలబస్ తగ్గించాల్సి వస్తోందని వెల్లడించారు. సిలబస్ పూర్తి చేసేందుకు వీలుగా సెలవులు కూడా తగ్గిస్తామని మంత్రి వివరించారు. 1, 3, 5, 7, 9 తరతులకు ఒకరోజు, 2, 4, 6, 8, 10 తరగతులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు.

About The Author