4వ ఇంటర్ సోసైటీ స్పోర్ట్స్ లీగ్ ను గచ్చిబౌలి స్టేడియంలో…

4వ ఇంటర్ సోసైటీ స్పోర్ట్స్ లీగ్ ను గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు డా. రాజీవ్ శర్మ ప్రారంబించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ, గురుకులాలు, రెసిడేన్షియల్ స్కూల్స్ ఉమ్మడిగా స్పోర్ట్స్ లీగ్ లో పాల్గోన్న ఈ మీట్ ను బుధవారం డా. రాజీవ్ శర్మ పార్రంబించారు. ఈ కార్యక్రమములో బి సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంఘీక, ట్రైబల్ వేల్పర్ సంక్షేమ పాఠశాలల కార్యదర్శి డా. ప్రవీణ్ కుమార్ , మైనారీటి సంక్షేమ పాఠశాలల కార్యదర్శి షఫియుల్లా పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాఠశాలల ద్వారా వెనుకబడిన వర్గాల విధ్యార్ధులకు నాణ్యమైన విద్య ను అందించి ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు డా రాజీవ్ శర్మ వెల్లడించారు. సంక్షేమ హస్టల్స్ లోని విద్యార్ధులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు ను ఉపయేగించుకొని ఉన్నత లక్ష్యాలు సాదించాలని విద్యార్ధులకు సూచించారు. విధ్యార్ధులు చేసిన మార్చ్ ఫాస్టును డా రాజీవ్ శర్మ స్వీకరించారు. అనంతరం విద్యార్ధులు ప్రధర్శించిన పలు రకాల సాంస్కృతిక విన్యాసాలు అలరించాయి.

About The Author