తాడిపత్రిలో జర్నలిస్ట్‌పై దాడిని ఖండించిన ఏ.పి. జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్మకాన్ని చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. ఈ విషయాన్ని తాడిపత్రి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడానికి జె.డి.ఎస్. రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా మనం ఇన్ఛార్జ్ తాడిపత్రికి విచ్చేసి తాడిపత్రి డిఎస్పీని కలిశారు. అనంతరం మచ్చా రామలింగారెడ్డి గారు తాడిపత్రి డిఎస్పీ తో ఫోన్‌లో మర్యాద పూర్వకంగా మాట్లాడారు. జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మచ్చా రామలింగారెడ్డి డిఎస్పీని కోరగా, డిఎస్పీ దీనిపై చర్యలు తీసుకుని బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కడప జిల్లా మనం ఇన్ఛార్జ్, జె.డి.ఎస్. నాయకులు వివేక్ యాదవ్, పులివెందుల జె.డి.ఎస్. నాయకులు శంకర్ రెడ్డి, తాడిపత్రి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పిల్లి సురేష్, ఉపాధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కన్నా, ట్రెజరర్ సి.బి.మధు, ఇర్పాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.