ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2618 కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 25 వేల 966 కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 16 మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాలో నలుగురు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,706 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 79లక్షల 55వేల 592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 88,790 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2618 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 95 వేల 592 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 23,668 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 123,చిత్తూరులో 423 తూర్పుగోదావరిలో 291, గుంటూరులో 387, కడపలో125 కృష్ణాలో 328, కర్నూల్ లో 040 నెల్లూరులో 096, ప్రకాశంలో 255, శ్రీకాకుళంలో 095, విశాఖపట్టణంలో 085, విజయనగరంలో 074,పశ్చిమగోదావరిలో 296 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -64,729, మరణాలు 562
చిత్తూరు -78,765,మరణాలు 784
తూర్పుగోదావరి -1,16,035 మరణాలు 612
గుంటూరు -67,607 మరణాలు 623
కడప -52,205 మరణాలు 439
కృష్ణా -39,652 మరణాలు 570
కర్నూల్ -59,508 మరణాలు 482
నెల్లూరు -59,592 మరణాలు 486
ప్రకాశం -59,656 మరణాలు 571
శ్రీకాకుళం -44,077 మరణాలు 340
విశాఖపట్టణం -55,898 మరణాలు 510
విజయనగరం -39,374 మరణాలు 230
పశ్చిమగోదావరి -86,023 మరణాలు 499

About The Author