ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణోత్సవ వేడుకలు…
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ స్థానిక గ్రౌండ్ నందు జాతీయ జెండా ఆవిష్కరించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా యస్.పి.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించింది. దీనిని పురష్కరించుకొని జిల్లా ప్రజలందరికి తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ తరపున శుభాకాంక్షలు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించాక ఏర్పడిన తరువాత తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తెలుగు బాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 15 అర్థరాత్రి మరణించే వరకు 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఫలితంగా జవహర్ లాల్ నెహ్రు నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దిగివచ్చి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ప్రకటించారు. అది అన్ని రాజ్యాంగ నియమాలను పూర్తిచేసుకొని 1అక్టోబర్ 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని బలమైన ప్రజల కోరికలకు అనుగుణంగా 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాజదానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నాడు నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మొట్ట మొదటి సారిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసారు.
మన అందరికి తెలుసు మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తోనే ఏర్పడినందుకు అందుకు కారణం అయినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు అలాగే ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మహానీయులను స్మరించుకుంటూ ఈ రోజు మనం అందరం ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఒక రాష్ట్రం ఏర్పడ్డం వెనుక ఆ తరువాత రాష్ట్రాన్ని అబివృద్ది పదములో తీసుకేలడానికి కృషి చేసినటువంటి ఎందరో మహానీయులను కూడా స్మరించుకోవాలి. వారి త్యాగ ఫలాలు మనకు, మన భావి తరాలకు తప్పకుండా అందజేయడంలో పోలీస్ వారి పాత్రా కూడా ఎంతో ఉంది. మనం సక్రమంగా పనిచేస్తూ రాజ్యంగ బద్దంగా ఈ రాష్ట్ర అభివృద్దికి పాటు పడాలని అందుకు ప్రతి ఒక్కరు ఎల్లవేళలా సందిగ్ధంగా ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీలో ఒకరై మీతో కలసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్దికి మనమందరం పాటు పాడదామని అందరం ప్రతిజ్ఞ చేసుకుందాం. జై హింద్ – జై ఆంధ్రప్రదేశ్
అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ర్యాలీని పోలీస్ స్థానిక గ్రౌండ్ నందు జెండా ఊపి ప్రారంబించి అక్కడ నుండి కోమలి రెడ్డి కూడలి, ఎయిర్ బైపాస్ రోడ్, అన్నమయ్య సర్కిల్ వరకు జిల్లా యస్.పి గారి అధ్వర్యంలో నిర్వహించి, అన్నమయ్య సర్కిల్ వద్ద “మానవహారం” ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరిపారు.
ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు, డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.