దుబ్బాక ఎన్నికల్లో కెసిఆర్ పార్టికి ఓటమి తప్పదా !

అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలి అంటే దుబ్బాకలో కేసీఆర్ పేంటు తడవాల్సిందే .

కెసిఆర్ రాజకీయ స్వార్థప్రయోజనాలకై నిత్యం తెలంగాణా – ఆంధ్రా ప్రజల మధ్య అగ్గి రాజేసే రాజకీయ కుట్రలు రచిస్తున్నారు.

జమిలి ఎన్నికలకు కేసీఆర్ మరో కుట్ర రచిస్తున్నారా !

కెసిఆర్ కు శ్రీశైలం డ్యామ్ ను అప్పగించమని కొరటానికి సిగ్గు అనిపించటంలేదా !

కేసీఆర్ తెలంగాణా ప్రజలనే కాకుండా భద్రాచలం శ్రీ రాముల వారిని సైతం మోసం చేసారు.

కేసీఆర్ నిజం పలికితే
యుగాంతం సంభవించినట్టే.
————-
మేడా శ్రీనివాస్, ఎద్దేవా.
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
————-
తెలంగాణా ప్రజలలో రోజు రోజుకు కేసీఆర్ ప్రభ తగ్గటంతో మరో అశాంతి ఉద్యమాలకు వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు దుబ్బాక ఎన్నికలు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.

బంగారు తెలంగాణా అని తెలంగాణా ప్రజలను నమ్మించి ఎందరో అమాయక యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పిన కెసిఆర్ కు
తెలంగాణా ప్రజలు బుద్దిచెప్పాల్సిన రోజు వచ్చిందని, విభజనకు ముందే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ చుట్టూనే కెసిఆర్ అభివృద్ధి మంత్రం జపించటం ఆస్యాస్పందంగా వుందని ఆయన ఘాటుగా విమర్శించారు.

తెలంగాణా ఉద్యమ పోరులో కొన్ని ఆత్మబలిదానాలు వెనుక కెసిఆర్, హరీష్ రావు విద్రోహ కుట్రలు దాగివున్నాయని, అధికారం కోసం హింసను ప్రేరేపించారని, తెలంగాణా బిడ్డల నిజాయతిని, వారి త్యాగాలను కెసిఆర్,హరీష్ రావు లు రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకున్నారని, దుబ్బాక ఎన్నికల్లో కెసిఆర్ పార్టి ఓటమితోనే తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం కోసం అమరులైన అమరవీరులకు శాంతి చేకూరుతుందని తెలంగాణా ప్రజలు ఓటు అస్త్రాన్ని చేతపుచ్చూకుని ఎన్నికల ఓటు తేదీకై ఎదురు చూస్తున్నారని ఆరోజు జరగబోయే ఘటనను ఆయన గుర్తు చేస్తున్నారు.

కెసిఆర్ రాజకీయ పతనం తోనే తెలంగాణా రాష్ట్రం బంగారు తెలంగాణా కల సాకారం అవుతుందని, తెలంగాణా, ఆంధ్రా ప్రజల ఐఖ్యత తోనే ఢిల్లీ పెద్దల మెడలువంచి మెరుగైన అభివృద్ధికి సాధ్యమైతుందని, తెలంగాణా, ఆంధ్రా ప్రజలు ఐఖ్యతను, అభివృద్ధి ని కెసిఆర్ జీర్ణించుకోలేడని, నిరంతరం ఇరురాష్ట్రాల ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే రాజకీయాలు, కెసిఆర్ అబద్దాలతోనే తెలంగాణా ప్రజలకు, రాష్ట్రం కు అభివృద్ధి సాధ్యం కాని రాజకీయాల ద్వారా కెసిఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన తీవ్రం గా విమర్శించారు.

ఎన్నికలు ముందు కేసీఆర్ 100 కోట్లుతో భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలంగాణా రామ భక్తులను నమ్మించారని, అధికారం పొందిన అనంతరం ఆ ఉసే మరిచి శ్రీ రాములు వారిని సైతం మోసం చేసారని, కేసీఆర్ రాజకీయ స్వలాబానికి సాక్షాత్తు దేవుడునే మోసగించిన కేసీఆర్ కు ప్రజలు ఒక లెక్క అని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ కు గిరిజన అభివృద్ధి అంటే గిట్టదని, అందుకే 100 కోట్లు వెచ్చించి భద్రాద్రి ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతాన్ని ఆనుకుని వున్న మెజారిటీ గిరిజనులు అభివృద్ధి చెందుతారు అనే దురుద్దెశ్యo తో భద్రాద్రి అభివృద్ధి ని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, భద్రాచలంను జిల్లాగా ప్రకటిస్థానని కొత్తగూడెం ను భద్రాద్రి కొత్తగూడెంగా జిల్లాపేరును ప్రకటించిన కేసీఆర్ గిరిజన అభివృద్ధి పై విషం కక్కారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు.

భద్రాచలం గత చరిత్ర ను తవ్వినా, ఆ నాటి బ్రిటిష్ పాలనలోను మొగలు నవాబుల పాలన నిజాలను తవ్వినా భద్రాచలం ఆంధ్రా ప్రాంతానికె చెందుతుంది అనే నిజం కేసీఆర్ కు తెలిసే భద్రాచలం అభివృద్ధిని వ్యూహత్మ కంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ధర్మ బద్దంగా హైదరాబాద్ రెవిన్యూ లో సగ భాగం ఆంధ్రప్రదేశ్ కు చెల్లించగలరా కేసీఆర్ అని , ఆ ప్రకారం చెల్లించే దమ్ము నిజాయతి కేసీఆర్ కు ఉందా ! అని ఆయన సవాల్ చేసారు

తెలంగాణా ప్రజలను నిత్యం మోసం చేస్తు అప్పుల కూపంలోకి నెట్టి వేస్తున్నారని, బంగారు తెలంగాణా ను బూచిగా చూపించి పేదరిక తెలంగాణా కు రాజకీయ పునాది మెట్లు కడుతున్నారని,
విభజన అనంతరం ఏఒక్క అభివృద్ధి చూపలేని కేసీఆర్ కపట బుద్దిని తెలంగాణా ప్రజలు నమ్ముతారా ! అని ఆయన విశ్మయం వ్యక్త పరిచారు.

ఉట్టికి ఎగరని వాడు ఆకాశానికి ఎగురుతాడనే సామెత వలే తెలంగాణా ప్రజల దాహార్తిని, రైతాంగానికి సాగు నీటిని,నాణ్యమైన విధ్యుత్ సరఫరాను అమలు చేయని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ భూబాగం లో గల శ్రీశైలం డ్యామ్ నిర్వహణను తనకు అప్పగించమనటంలో కేసీఆర్ మానసిక స్థితి పై అనుమానాలు వ్యక్త మవుతున్నాయని ఆయన తెలిపారు.

రానున్న జమిలి ఎన్నికలను గమనించిన కేసీఆర్ తెలంగాణా ప్రజల వ్యతిరేకతను ముందుగానే తన ఆంతరంగిక సమాచారం ద్వారా గమనించి మరో నీటి వివాదాలకు కేసీఆర్ కుట్ర రచిస్తున్నారాని, భోజనం చేసే నేత ఎవరన్నా పరాయి రాష్ట్రంలో శ్రీశైలం డ్యామ్ నిర్వహణ పై హక్కు అప్పగించమని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరతారా అని, అలాంటి సిగ్గు మాలిన చర్యను కోరేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని ఆయన విమర్శించారు.

ఒక లక్షకు పైగా పుస్తకాలు చదివాను అని అబద్దాలను కూడా నిజమేనని చెప్పుకోగలిగే
కేసీఆర్ కు కనీస చరిత్ర తెలియక పోవటం విడ్డురంగా వుందని, భద్రాచలం రెవిన్యూ డివిజన్ లో బాగంగా వున్న దుమ్ము గూడెం తెలంగాణా భూబాగంలోదా ! 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి భద్రాచలం ఆంధ్రా ప్రాంతంలోనిది కాదా అని, ఆనాడు పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలంను తాత్కాలికంగా 1959 లో ఖమ్మం జిల్లాలో కలపడం నిజంకాదా !అంతేకాకుండా 1768 నుంచి కూడా భద్రాచలం నిజాం పాలనలో కాకుండా బ్రిటిష్ పాలనలో వున్న మాటను కేసీఆర్ అంగీకరించగలరా ! రెండున్నర శతాబ్దాలు భద్రాచలం బ్రిటిష్ పాలనలోకూడా గోదావరి జిల్లాలో వున్న మాట నిజం కాదా ! భద్రాచలం
శ్రీ రామచంద్ర మూర్తి వారి ప్రధాన ఆస్తులు అన్ని ఆంధ్రప్రదేశ్ లోనే వున్నాయని, ఆనాటి భద్రాచలం జమీందారు వారుకూడ 21,090/-
రూపాయలు గోదావరి జిల్లా జమిందార్ గా బ్రిటిష్ వారికి కప్పం(లేవి) కట్టేవారని, ఆనాటి నిజాం పాలనకు కాదు అని ఆయన గుర్తు చేసారు.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో భావోద్రేకాలను రెచ్చగొట్టి తిరిగి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్న కేసీఆర్ దుర్బుద్ధి పట్ల తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం గా వుండాలని ఆయన సూచించారు.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐఖ్యత ను, భద్రతను, ప్రాంతాల అభివృద్ధి ని ప్రోత్సహించే నేతలను, పార్టీలను ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రోత్సాహిస్తేనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని,ధనిక రాష్ట్రాలు గా ఎదుగుతాయని, కేసీఆర్ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని, తెలంగాణా, ఏపి ప్రజల ఉమ్మడి కార్యాచరణ తోనే రెండు తెలుగు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా ఉన్నత స్థితికి చేరుకుంటాయని, ఆయన ఆశాబావం వ్యక్త పరిచారు.

శ్రీశైలం డ్యామ్ నిర్వహణ భాద్యత అప్పగించమని కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రకటించుకున్నా ఆంధ్రప్రదేశ్ లోగల ఎ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీలలో కనీస చలనం రాకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించాలని, ఆనాడు విభజన సమయంలో కూడా అడగవలసినవి, రాబెట్టవలసినవి కూడా అడగకుండా రాజకీయ స్వప్రయోజనానికే ప్రాధాన్యతనిచుకున్న ఏపి ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆంధ్రా ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన పేర్కొన్నారు.

సిగ్గులేకుండా రాజకీయ అబద్దాలు చెప్పే కేసీఆర్ హైదరాబాద్ పై ఇంకను హక్కు గల ఏపి వారి రెవిన్యూ వాటాను అప్పగించే దమ్ము, నీతి నిజాయతి కేసీఆర్ కు వుందా ! భయపెడుతూ , వేధింపు చర్యలే రాజకీయ అక్షరాభ్యాసంగా వంట పట్టించుకున్న కేసీఆర్ కు పాలనా అర్హత లేదని, కేసీఆర్ కుట్ర రాజకీయాలకు ముందుగా తెలంగాణా ప్రజలే గుణపాఠం చెప్పాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.

సభకు అర్పిసి నగర నాయకులు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి నాయకులు సర్వశ్రీ డివిఆర్ మూర్తి, ఎండి హుస్సేన్ వర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్, బూడిద సత్యనారాయణ, ఇళ్ల రాము, మాసా అప్పాయమ్మ,నాగురు అన్నపూర్ణ, నాగూరు సంజీవ్ తదితరులు పాల్గొనియున్నారు.

–మేడా శ్రీనివాస్,
వ్యవస్థాపక అధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

About The Author