మహిళలు తమ భర్తల తల్లిదండ్రుల ఇండ్లలోనూ ఉండవచ్చు, సుప్రీం కోర్టు సంచలన తీర్పు.


1980ల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇది అమలవుతోంది. కుటుంబ పరంగా.. అందరూ కలిసి వివాదాల్లేకుండా ఆస్తులు పంచుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా వివాదాలు ఏర్పడితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కుమార్తెలకూ .. హక్కులు దక్కుతున్నాయి. ఇప్పుడు… అన్నింటిలోనూ సగం అంటున్న మహిళాలోకానికి ఇప్పుడు ఆస్తిలోనూ సగం అని.. సుప్రీంకోర్టు అభయం ఇచ్చేసినట్లయింది. అయితే భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు చెప్పింది.
గృహ హింస చట్టం ప్రకారం కోడలు తన అత్త మామ ఇంట్లోనూ నివాసం ఉండవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తరుణ్ బాత్రా కేసులో ఇద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పును కోర్టు మార్చి పై విధంగా తీర్పు చెప్పింది. ఓ మహిళ తన భర్తకు చెందిన తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉండే హక్కు ఆమెకు లేదని గతంలో ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం తరుణ్ బాత్రా కేసులో తీర్పు ఇవ్వగా, దాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యతిరేకింది.
ఈ క్రమంలో సుప్రీం తాజా తీర్పుతో మహిళ తన భర్త తల్లిదండ్రుల ఇండ్లలోనూ ఉండవచ్చు. అందుకు సుప్రీం కోర్టు అనుమతినిస్తుంది. కాగా సదరు తీర్పును వెల్లడించే క్రమంలో సుప్రీం ధర్మాసనం 6-7 ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పింది. తల్లిదండ్రుల ఆస్తులను పంచుకునే హక్కు వ్యక్తికి ఎలాగైతే ఉంటుందో అతని భార్యకు అతని తల్లిదండ్రుల ఇంట్లో ఉండే హక్కు కూడా ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

About The Author