హిందూ సనాతన ధర్మములో స్త్రీల జడ యొక్క రహస్యం…..


హిందూ సనాతన ధర్మము యొక్క పరిజ్ఞానం, విశిష్టత ఆంగ్ల శాస్త్రవేత్తలకె ఇంత వరకు అంతు చిక్కని యదార్థం…

స్త్రీల జడ.. మూడూ పాయలు ఉంటాయి…
జడలోని ఆ మూడు పాయలు…
౧. *ఇడా*
౨. *పింగళ*
౩. *సుషుమ్న*
అనే మూడు నాడులకు సంకేతాలు… వెన్నెముక కు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారము నుండి సహస్రారము నకు చేరుకొనే కుండలినీ సంకేతము…

జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగ వలే సహస్రార పద్మము నకు సాంకేతికము… మూడు పాయల ముడుల వలె ఇడా, పింగళ నాడులు పెనవేసుకు ఉంటాయి… అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము…

ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన హిందూ సనాతన ధర్మము యొక్క సంస్కృతి స్త్రీల జడలలో దాచింది… ఈ విధముగా స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధుల నుండి వారి స్వయం రక్షణకు మార్గము లను మన పూర్వీకులు పొందుపరిచారు…

మన పెద్ద వారు చెప్పిన ప్రతి విషయం లోను సైన్స్ ఉంది… ఆరోగ్యం ఉంది.. అన్ని పాత చింతకాయ పచ్చడి అని తోసేసి ఇప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నాం… వీలు అయినన్ని పాత పద్దతులు పాటించుదాం.. ఆరోగ్యం గా ఉందాం….

సర్వేజనా సుఖినోభవంతు …

About The Author