ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి మండిపడ్డ హైకోర్టు…
*ఎస్‍ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదు*
★ ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.
★ మీకు ఇష్టంలేదని వ్యక్తిని తీసేస్తే అతనికి న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పిస్తే.. మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.
★ రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
★ ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తాయి.. రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయి.
★ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి దీనిపై 3 వారాల్లో ఎస్‍ఈసీ సమగ్రమైన నివేదిక ఇవ్వాలి.
★ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‍ఈసీకి కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలి.
★ జస్టిస్ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదు.
★ కనగరాజ్ ఆ డబ్బులు తాను వ్యక్తిగతంగానే చెల్లించాలి.
★ కనగరాజ్ డబ్బుల విషయాన్ని ఈసీ పరిశీలించాలి.
★ ఆయన లీగల్ ఖర్చులకు ఎస్‍ఈసీ ఎందుకు డబ్బులు ఇవ్వాలి.
★ అన్ని అంశాలపై ప్రభుత్వానికి ఎస్‍ఈసీ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు.
★ ఎస్‍ఈసీ నివేదికను బట్టి ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు.
★ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన హైకోర్టు.