బల్దియా ఎన్నికల్లో ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ చేస్తామని చెప్పాం కానీ… ‘ సాఫ్రాన్ స్ట్రైక్ ‘ చేశాం.


ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ‘ సన్ స్ట్రోక్ ‘… కమలానికి ‘ సన్ రైజ్ ‘ అయింది.

బిజెపికి మద్దతునిచ్చిన భాగ్యనగర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బిజెపి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన, వీరోచిత పోరాటం చేసిన కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

తెలంగాణలో జరుగుతున్న అరాచక, అవినీతి, కుటుంబ పాలనను గుర్తించిన జాతీయ నాయకత్వం ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఎన్నికల్లో అండగా నిలిచింది. మమ్మల్ని ప్రోత్సహించిన జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి నడ్డా గారికి, అభినవ సర్దార్, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి, యూపీ సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి, మహారాష్ట్ర మాజీ సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారికి, కేంద్రమంత్రులు శ్రీమతి స్మృతి ఇరానీ గారికి, శ్రీ ప్రకాష్ జవదేకర్ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారికి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె. లక్ష్మణ్ గారికి, సమన్వయంతో, కష్టపడి పనిచేసిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం కార్యకర్తల కష్టార్జితం.
రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎస్ఈసీకి ఈ విజయం అంకితం.
బిజెపి కార్యకర్తలపై దాడులను పట్టించుకోని రాష్ట్ర డిజిపికి ఈ విజయం అంకితం.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్..,బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేసింది. ప్రజల్లో భయానక వాతావరణం, మత విధ్వేషాలు సృష్టిస్తారంటూ దుష్ప్రచారం చేసింది. ఎంఐఎం పార్టీతో అంటకాగిన టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గ్రహించారు.టీఆర్ఎస్ మద్యం ప్రవాహం,డబ్బుల పంపిణీతో అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నించింది. తప్పుడు సర్క్యలుర్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేశారు.బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి దౌర్జన్యంగా వ్యవహరించారు.దుబ్బాకలో కేసీఆర్ అల్లుడికి,గ్రేటర్ లో కుమారుడికి ప్రజలు తగిన బుద్ధిచెప్పారు.టీఆర్ఎస్ గడీల పాలనను బద్దలుకొట్టేందుకు ప్రజలు బిజెపికి అండగా నిలిచారు.

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది…
కౌంట్ డౌన్ మొదలైంది.
కారు.. సారు.. ఇకరారు..అని జీహెచ్ఎంసీ ఫలితాలతో నిరూపితమైంది. టీఆర్ఎస్ ఫేక్ లెటర్లు సృష్టించి ఫోర్జరీ సంతకం చేసి వరద బాధితులకు రూ.10వేల సాయాన్ని ఆపింది.

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేస్తామంటూ ఓవైసీ దుర్మార్గంగా మాట్లాడినా, ముఖ్యమంత్రి నోరుమెదపలేదు. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలతో గెలవాలని కుట్ర చేసిన టీఆర్ఎస్ – ఎంఐఎంలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి గడీల నుంచి బయటకు రావాలి. బిజెపి ఏ వర్గానికి వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం బిజెపి పోరాటం చేస్తోంది. దాన్ని గుర్తించే ప్రజలు ఈ తీర్పునిచ్చారు. అమరవీరుల ఆశయం సాధన కోసం పనిచేస్తాం…ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం.

భారత్ మాతా కీ జై !

About The Author