ఏపిపియస్ సి గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు 59.81 శాతం మంది విద్యార్థులు హాజరు


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని, 59.81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టరు ఏ.యండి ఇంతియాజ్ అన్నారు.

విజయవాడ నగరంలో సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన గ్రూపు-1 మెయిన్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టరు పరిశీలించారు .

పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించి పరీక్షల నిర్వాహణాతీరును కలెక్టరు
పరిశీలించారు.

ఈసందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ గ్రూపు-1 మెయిన్ పరీక్షకు 7 పరీక్షా కేంద్రాలలోనూ మొత్తం 1453 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 869 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాసారని, 584 మంది పరీక్షకు గైర్హాజరు అయ్యారని కలెక్టరు అన్నారు.

విజయవాడ ప్రకాష్ పబ్లిక్ స్కూలు పరీక్షా కేంద్రంలో 86 మంది, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలో 126 మంది, పియస్ సియంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో 148 మంది, పోరంకి లోని సంవిదా విద్యా పీఠ్ పరీక్షా కేంద్రంలో 66 మంది, సూరంపల్లి పిపిడి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రంలో 230 మంది పోతవరప్పాడు ఉషారామ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో 127 మంది గ్రూప్-1 మెయిన్ పరీక్షకు హాజరు అయ్యారని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు.

About The Author