పంజాబ్ రైతులకు మద్దతుగా కండిల్ ర్యాలీ…
మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని.. పంజాబ్ ,హర్యానా రాష్ట్రాల రైతులు దేశ రాజధాని అయిన ఢిల్లీలో 17 రోజులుగా రైతు ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నదని అప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా 500 ప్రజా సంఘాల పిలుపుమేరకు ఈ నెల 15న కొవ్వొత్తులతో నిరసన 16న రిలయన్స్ మార్ట్ వద్దా నరసన్న 17 నుండి 20 వరకు గ్రామ స్థాయిలో రైతులతో నిరసనలు 21న మండల కేంద్రాల్లో ధర్నాల కు రైతు సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా.. రేణిగుంట మండలం దిగువ మల్లవరం రోడ్డుపై మంగళవారం రాత్రి ఏడు గంటలకు “కొవ్వొత్తులతో ర్యాలీ” ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం- రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, చిన్నం పెంచలయ్య, రైతు సంఘం అధ్యక్షులు అంగేరి పుల్లయ్య, ఆర్ పి ఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, అంబేద్కర్ ఆర్మీ గోపి, ఐద్వా, కెవిపిఎస్, గిరిజన సంఘం, ప్రజానాట్యమండల, రైతులు సుబ్బయ్య గుంట, ఆర్ మల్లవరం, దిగువ మల్లవరం గ్రామ రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది.
కె.హరినాథ్,
(మండల కార్యదర్శి- సిపిఎం పార్టీ) రేణిగుంట.