మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు : సిఐ అనిల్


తాగి వాహనాలు నడిపిన ఏడుగురి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన న్యాయమూర్తి
మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని సూచన
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మరిన్ని చర్యలు
నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను రెండు నెలల పాటు రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు నల్లగొండ ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 15 మంది వ్యక్తులను సోమవారం జిల్లా రెండవ తరగతి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా ఎనిమిది మందికి 2,500 రూపాయల చొప్పున, మరో ఏడుగురు వ్యక్తులకు రెండు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితులు అందరూ గమనించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించబోమని, జరిమానాలు, జైలు శిక్షలతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. వాహనదారులంతా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిబంధనలు పాటిస్తూ పోలీసులతో సహకరించాలని సిఐ అనిల్ కుమార్ కోరారు.

About The Author