సుమారు 12,69,000/- విలువ చేయు 207 గ్రాముల బంగారు నగలు స్వాధీనం..
*రాబరీ దొంగల అరెస్ట్, వారి వద్ద నుండి సుమారు 12.69,000/-విలువ చేయు 207 గ్రాముల బంగారు నగలు మరియు దొంగతనమునకు ఉపయోగించిన Share Auto, హోండా ఆక్టివ్ మోటార్ సైకిల్ ను స్వాధీనం.
రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు డిసెంబర్ నెల 16 వ తేదీ ఉదయం 11.30 AM గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి, వైకుంటపురము ఆర్చ్ ముందర రోడ్డు మార్జిన్ వద్ద అలిపిరి పోలీసు స్టేషన్. Cr.No.623/2020 u/s 394 IPC కేసుకు సంబంధించిన కేసులలో ముద్దాయిలు అయిన సాలె వీరనాగులు వయసు 31 సం.లు తండ్రి పేరు భద్రరావు, H No 20-5-42/11, సుబాష్ నగర్, తిరుపతి 2) వాడగట్టి ప్రసన్న కుమార్ వయసు 32 సం. @ శ్రీనివాసులు తండ్రి పేరు వి.రఘు, H No 19-2-83, శ్రీనివాసాపురం, తిరుపతి 3) బొడ్డపాటి సునిల్ కుమార్, వయసు 27 సం. తండ్రి మల్లేశ్, దిమిలాడ విలేజ్, నందిగామ మండల్, శ్రీకాకులం జిల్లా. అను వారిని తిరుపతి సి.సి.యస్. ఇన్స్పెక్టర్ K.రసూల్ సాహెబ్, అరెస్టు చేసి వారి వద్ద నుండి 207 గ్రాముల బంగారు నగలు, Cash 69,000/-, auto, Honda Activa, tools, Cell phones మరియు దొంగతనమునకు ఉపయోగించిన హోండా ఆక్టివ్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగినది.
సదరు అరెస్టు కాబడి ముద్దాయిలో మొదటి వాడు సాలె వీరనాగులు రాబరీ జరిగిన ఇంటి ఓనర్ షాప్ లో సుమారు ఒక నెల ముందు పనికి నిలిచిపోయినాడు. తరువాత పధకం ప్రకారం షాప్ మరియు ఇంటిలో గల వస్తువులు నగలు, డబ్బులు కల అన్నీ ఉన్న ప్రదేశంలు గుర్తు పెట్టుకుని ఇంటిలో ఓనర్ ఒంటరిగా ఉన్న సమయములో తన సహచరులతో కలసి దాడి చేసి నగలు దొంగిలించినడు. వారిని రిమాండు నిమిత్తం కోర్టు లో హాజరు పరుస్తున్నామని, తిరుపతి క్రైమ్ సబ్-డివిజన్ DSP, జి. జి.మురళిధర్ గారు తెలిపినారు.
పై అరెస్ట్, రికవరీ, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేశ్ రెడ్డి ఐ.పి.యస్, వారి ఆదేశాలు మేరకు, తిరుమల అడిషనల్ యస్.పి శ్రీ మునిరామయ్య గారి సూచనల మేరకు తిరుపతి క్రైమ్ సబ్-డివిజిన్ డి.యస్.పి జి.మురళిధర్ గారి ఆధ్వర్యంలో ముద్దాయిను తిరుపతి CCS. CI కే.రసూల్ సాహెబ్, అరెస్టు చేయగా సి.ఐ లు డి.చల్లని దొర, మోహన్, వేణుగోపాల్ మరియు సిబ్బంది SI రమేశ్ బాబు, సిబ్బంది ASI 521, HC 720, HC 783, HC 971 PCs 907, 1133, 2163 లు పాల్గోన్నట్లుగా, ఈ ముద్దాయిని అరెస్టు చేసి పై కేసును చేధించిన C.I. లు, మరియు సిబ్బందిని జిల్లా యస్.పి గారు అభినందిస్తూ రివార్డుల ప్రకటించారు.