కలియుగ కర్ణుడికి గుడి క‌ట్టిన తెలుగోడు….


కలియుగ కర్ణుడికి గుడి క‌ట్టిన తెలుగోడు….
లక్షలాది మందికి సాయం చేసినందుకే…
తెలంగాణలో సోనూసూద్‌కి కోవెల…

కలియుగ కర్ణుడు… ఆపద అన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నవాడు… సాయం చేయడానికి ఆస్తులను సైతం తాకట్టుపెడుతున్న అభినవ హరిశ్చంద్రుడు… అన్నా అని అర్ధించిన వారికి నేనున్నా అని అభయవిస్తున్న యుగ పురుషుడు సోనూసూద్… సినిమాల్లో నటించేది విలన్ పాత్రల్లో అయినా నిజజీవితంలో తాను మాత్రం హీరోనేనని నిరూపిస్తున్నాడు. కరోనా కారణంగా దేశంలో ఏర్పడిన లాక్‌డౌన్ కాలంలో వేలాది మంది వలస కూలీలను వారివారి స్వస్థలాలకు పంపించాడు. విదేశాల్లో ఉన్న వారిని సైతం స్వదేశానికి తీసుకొచ్చాడు. ఒక్కటేంటీ… ఆపద అని అన్న ప్రతీ వారికి సాయం చేశాడు. కోట్లాది మంది హృదయాల్లో చిర స్థాయిలో నిలుస్తున్నాడు.

తెలంగాణలో గుడి….
కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సినిమా నటుడు సోనూసూద్‌కు తెలంగాణలో గుడి కట్టారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాకు చెందిన దుబ్బ తండాలో సోనూసూద్‌కు గుడి కట్టారు అక్కడి గిరిజనులు. సోనూసూద్ లక్షలాది మందికి చేస్తున్న సహాయ గుణాన్ని చూసి తాము ఆయనకు గుడి కట్టామని స్థానికులు తెలుపుతున్నారు. ఆయనకు గుడి కట్టడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About The Author