లబ్ధిదారులు పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం…
లబ్ధిదారులు పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం
*మొదటిరోజు ఇళ్ల పట్టాల పంపిణీ వారోత్సవాలు
*25 వేల ఐదు వందల మందికి వారంలో పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం
*వికృతమాల హౌసింగ్ కు సంబంధించిన ఇంటి పట్టాలు పంపిణీ
*తిరుపతి శాసనసభ్యుడు భూమన
*తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 45 వ వార్డు నుండి 50 వార్డు వరకు వై.యస్.ఆర్ జగన్ అన్న ఇళ్ల పట్టాలు వారోత్సవాలు కార్యక్రమం శుక్రవారం జీవకోన అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్యక్రమం నిర్వహించి పేద అక్క చెల్లెమ్మలకు ఇల్లు పట్టా అభిషేకం నేటి నుండి వారం రోజు నిర్వహిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన, కమిషనర్ గిరీష తెలియజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుండి వారం రోజులు పాటుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు-పేదలందరికీ వై.యస్.ఆర్ జగన్ అన్న ఇంటి పట్టాలు మరియు వికృతమాల వద్ద నిర్మించిన ఇల్లులు పేద అక్క చెల్లెమ్మలకు, ఇళ్ల పట్టాలు తీరనున్న పేద వారి సొంత ఇంటి కల నెరవేర్చడం చాలా సంతోషమని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్ల స్థలాలు పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల తో పాటు ఇల్లు కూడా ఇవ్వడం చాలా సంతోషమని, ప్రతి లేఅవుట్లో అక్కా చెల్లెమ్మలు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా జీవించేందుకు వై.యస్.ఆర్ జగన్ అన్న కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పూల మొక్కలు, అందమైన గార్డెన్ లాగా నిర్మిస్తామని మరియు వై.యస్.ఆర్ జగన్ అన్న కాలనీలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా లబ్ధి పొందిన అక్కాచెల్లెళ్లకు తెలియజేశారు.
కమిషనర్ గిరీష మాట్లాడుతూ నేటి నుండి వారం రోజులు పండగ వాతావరణంలో వై.యస్.ఆర్ జగన్ అన్న నిరుపేదల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇల్లులు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని 25500 ఇంటి పట్టాల తో పాటు వికృతమాల వద్ద నిర్మించిన 1800 వందల ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుందని, తిరుపతి నగర ప్రజల కోసం గతవారం లాటరీ పద్ధతి ద్వారా ఆన్ లైన్ డిప్ ను వేయడం జరిగిందని, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, రేణిగుంట మండలం సూరప్ప కశం, జీపాల్యం, చంద్రగిరి కొత్తపల్లి, ఏర్పేడు మండలం లోని చిందేపాల్యం, వడమాలపేట మండలంలోని కల్లూరు, టి సి అగ్రహారం లేఔట్ సిద్ధం చేశామని, నేటి నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని, ఇంటి పట్టాల తో పాటు రేణిగుంట పాపా నాయుడు పేట మార్గం వద్ద నిర్మించిన వికృతమాల హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ఇవ్వడం జరుగుతుందని, వికృతమాల వద్ద 18వందల ఇల్లులు కట్టించడం జరిగిందని, 75 బ్లాకులు, జి ప్లస్ 2 ఇల్లులు ఒక బ్లాకు 24 కట్టి ఇవ్వడం జరిగిందని, కొత్త రోడ్లు, స్కూలు, కమ్యూనిటీ హాలు, పార్కులు, డ్రైనేజ్, వాటర్ సప్లై, కాంపౌండ్ వాల్ మొదలగువాటిని నిర్మించామని,గృహ ప్రవేశం చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం లబ్ధి దారులు అక్కాచెల్లెళ్లకు, ఇళ్ల పట్టాలు తో పాటు వికృతమాల హౌసింగ్ సంబంధించిన ఇంటి పట్టాలు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భారీ ఎత్తున అక్క , చెల్లెమ్మలు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు గురించి మాట్లాడినారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారితోపాటు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, హౌసింగ్ అధికారులు, వై.ఎస్.ఆర్.సి పి నాయకులు అన్నా రామకృష్ణ, రాజేంద్ర, శ్రీదేవి, మహిళలు పాల్గొన్నారు.