మేషం 

2021 సంవత్సరం మీకు అనేక ఆశలు, అవకాశాలు తీసుకువస్తుంది. మీరు రూపొందించుకున్న ప్రణాళికలన్నింటిలోనూ విజయం సాధిస్తారు. ఆ కారణంగా మీ ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు చోటుచేసుకుంటాయి. మీ ఆర్థికస్థితి బలోపేతమవుతుంది. ఉద్యోగులు అకుంఠిత దీక్షతో పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ నాయకత్వ నైపుణ్యంతో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.మీ సహచర ఉద్యోగులు మీకు అండగా ఉంటారు. మీ జీవితాన్ని పరిపుష్టం చేయడంలో స్నేహితులు మీకు లాభదాయకంగా ఉంటారు. పెద్దల నుంచి ఆశీర్వచనాలు అందుకుంటారు, మీ లక్ష్యాలన్నీ నెరవేర్చుకుంటారు. గ్రహస్థితి కారణంగా సంవత్సరం మధ్యలో మీ పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అంతే కాదు సహనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు సమస్యలు సృష్టించవచ్చు. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే మీ కోరిక నెరవేరే సూచనలు అధికంగా ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో మీరు శుభవార్త వింటారు. అదృష్టం మీకు అండగా ఉంటుంది. వృత్తిపరంగానూ మీరు మంచి ఫలితాలు చూస్తారు. సంవత్సరం మధ్యలో మీరు ఉద్యోగరీత్యా మరో ప్రదేశానికి బదిలీ కావచ్చు, కాని, అది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం బారినపడతారు, అది మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. వారి కోసం మీ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతూకం చేసుకోకుండా మీరు డబ్బు వెనుక పరిగెడితే అది మీ కుటుంబంలో సమస్యలకు దారితీస్తుంది. ఈ సంవత్సరం మీరు స్థిరాస్తి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇల్లు కూడా కొనవచ్చు, కాని దాని కోసం మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది. మీ తోబుట్టువుల నుంచి ఈ సంవత్సరం మీకు మంచి సహకారం లభిస్తుంది.

వృషభం 

మిమ్మల్ని మీరు నిలదొక్కుకునేందుకు ఈ సంవత్సరం మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో మీరు గ్రహిస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. లక్ష్యసాధన కోసం మీరు ఏ హద్దు దాటేందుకైనా సిద్ధంగా ఉంటారు. సౌకర్యవంతంగా జీవించాలన్న మీ కోరిక నెరవేర్చుకునేందుకు మీరు మరింత శ్రమిస్తారు. పెద్దల ఆశీర్వాదాలతో మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. 2021లో మీరు దూర ప్రయాణం చేసే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను తరచూ సందర్శిస్తారు. ప్రయాణాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ సంవత్సరం మీరు విదేశీ పర్యటన కూడా చేపట్టవచ్చు. కర్మను ఎదుర్కొవడానికి కూడా మీరు ఈ సంవత్సరం సిద్ధంగా ఉండాలి. మీరు ఏదైనా తప్పుడు పనులు చేసినట్టు అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో దానికి సంబంధించి శిక్షకు గురవుతారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మీరు రాజీపడాల్సి ఉంటుంది. మీ టీచర్లు, ప్రొఫెసర్లు మీ రక్షకులవుతారు. వారి సాయంతో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నట్టు అయితే, వారు ఈ సంవత్సరం విదేశీ పర్యటన చేపట్టవచ్చు.

మిథునం 

2021 సంవత్సరం మీకు సాధారణంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత చికాకుగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు గుర్తెరిగి ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా మీకు సాయపడతాయి. ఆర్థికపరంగా ఈ సంవత్సరం బాగానే ఉన్నా కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. కాని, మీ ఆత్మగౌరవం, అద్భుతమైన ప్రణాళికలతో ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను మీరు తగ్గించుకుంటే మీ ఆర్థిక పరిస్థితిలో సమతూకం సాధించగలుగుతారు. మీరు ఏదైనా పోటీల్లో పాల్గొనదలిస్తే అందులో విజయం సాధించేందుకు మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మిమ్మల్ని మీ అంతరాత్మ ముందుకు నడిపిస్తుంది, అది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. అలా నడుచుకోవడం ద్వారా మీరు జీవితంలో కీలక ఘట్టాలను అధిగమిస్తారు. మీ తెలివితేటలు, మేధస్సును ఇతరులు విశ్వసిస్తారు. ఇతరులపై ఆధారపడటం కన్నా స్వీయశక్తినే మీరు అధికంగా నమ్ముతారు. ఆరోగ్యపరంగా 2021లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కర్కాటకం 

2021 సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. ఆందోళనలను మీరు నియంత్రించగలుగుతారు. పరిస్థితులను బట్టి మీరు రకరకాల విషయాలు నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగుతారు. వ్యాపారం, ఉద్యోగంలో మీరు విజయం సాధిస్తారు. మీరు విజయవంతమైన వ్యాపారి అవుతారు. వ్యాపారపరంగా మీరు మీ మంచి మాత్రమే చూసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా కృషి చేస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు చక్కని సమృద్ధిని చూస్తారు. మీ మార్గంలో అడ్డంకులు ఉంటాయి, కాని వాటిని ధైర్యం, నైపుణ్యంతో అనుకూలంగా మల్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కారం, నూనె పదార్థాలు దూరం పెట్టడం మంచిది. మీరు బరువు పెరుగుతారు. ఒకవేళ మీరు ఊబకాయులు అయితే ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు మీ ప్రేమలో వాస్తవాన్ని చూస్తారు. భాగస్వామితో మీరు నమ్మకస్తులుగా ఉంటూ ప్రేమను చూపుతారు. అది భాగస్వామితో మిమ్మల్ని సన్నిహితం చేస్తుంది. అయితే మీరు సరిగ్గా స్పందించకుంటే పరిస్థితి తలకిందులు కావచ్చు. 2021లో మీరు కుటుంబంపై పూర్తి దృష్టిసారిస్తారు, కుటుంబ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇది మీ కుటుంబసభ్యులను సంతోషపరుస్తుంది, వారి నుంచి ప్రేమ, సహకారాన్ని పొందుతారు. మీరు సంతృప్తిగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తారు.

సింహం 

ఈ 2021 సంవత్సరాన్ని మీరు గొప్ప విశ్వాసంతో ప్రారంభిస్తారు, అది సంవత్సరమంతా స్థిరంగా ఉంటుంది. మీరు కోరుకున్న ప్రతీది సాధిస్తారు. ఈ సంవత్సరం మీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఆదాయం పరిమితంగా ఉంటుంది. ఆర్థికపరంగా పెద్దగా ఒత్తిడి మీపై ఉండదు. ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీరు అశాంతితో ఉంటారు. మీ మనస్సు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పనిలో మీకు స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అడ్డదారుల్లో వెళ్లకపోవడం మంచిది, లేని పక్షంలో అది సమస్యలు సృష్టిస్తుంది. మీ కఠిన శ్రమతో మీరు ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లే ఆలోచనలో మీరు ఉన్నట్టు అయితే, ఈ సంవత్సరం మీకు అవకాశాలు లభిస్తాయి. 2021లో మీరు మీ వ్యవహారాలకే పరిమితమవడం మంచిది, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అది మీకు సమస్యగా మారవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది, వారు విజయాన్ని అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రతగా ఉండాలి, కాలానుగుణంగా వచ్చే వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సంవత్సరం మీ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.

కన్య 

ఈ సంవత్సరం మీకు చాలా లాభసాటిగా ఉంటుంది. మీ కలలు సాకారమవుతాయి. జీవిత విలువలు తెలుసుకొని మీరు గొప్ప వ్యక్తిగా మారుతారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా, ఆనందదాయకంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం పొందుతారు, మీ రంగంలో మీరు విజయం సాధిస్తారు. అలవాట్ల విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాలి, లేనిపక్షంలో అవి అనవసర వివాదాలకు కారణమవుతాయి. ఈ సంవత్సరం మీరు ధార్మిక క్షేత్రాన్ని సందర్శిస్తారు లేదా పుణ్యనదిలో పవిత్రస్నానమాచరిస్తారు. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఒత్తిడిరహితంగా ఉంచుతుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయంలో పెరుగుదలను మీరు చూస్తారు. ఈ సంవత్సరం కొన్ని సవాళ్లు మీకు ఎదురైనా, మొత్తంగా ఈ ఏడాది మీకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారంలో వృద్ధి చూస్తారు. మీరు సంబంధాల్లో ఉంటే మీ ప్రేమానుభూతి బలోపేతమవుతుంది. లక్ష్యసాధన కోసం మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది. జీవితం పట్ల ఆచరణాత్మక విధానం కలిగి ఉండాలి. దృఢసంకల్పం, లక్ష్యంతో మీరు ముందుకు సాగితే విజయాన్ని అందుకుంటారు. పిల్లలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. వారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చదువులపరంగా మీకు ఈ సంవత్సరం అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, అవకాశం రెండోసారి రాదు కాబట్టి, దాన్ని చేజార్చుకోకండి. అదృష్టం మీకు అండగా ఉంటుంది, లక్ష్యాలను మీరు చేరుకుంటారు. 2021లో మీరు కొత్త విజయ శిఖరాలను అందుకుంటారు. ఇతరులను పణంగా పెట్టి మీరు విజయం అందుకునేలా చూసుకోకండి, అలా జరిగితే భవిష్యత్‌లో అది మీకు హానికరంగా మారవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది, వారి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తుల 

ఈ 2021 సంవత్సరంలో మీకు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మీరు చక్కని ఫలితాలు పొందుతారు, కొన్నింటిలో మీకు నిరాశ ఎదురవుతుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ బాధ్యతరాహిత్యపు స్వభావం సమస్యలు సృష్టిస్తుంది. కుటుంబ సభ్యులతో వేరుపడే బాధను మీరు అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండాల్సిన సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మీరు లేని బాధను మీ కుటుంబసభ్యులు అనుభవిస్తారు. ఆర్థికపరంగా ఈ సంవత్సరం మామూలుగా ఉంటుంది, కాని అప్పుడప్పుడు మీకు డబ్బు భారీగా అందుతుంది. ఈ సంవత్సరం మీరు కొత్త సంబంధం ప్రారంభించవచ్చు. మీ సంతోషానికి మీ స్నేహితులు లేదా బంధువులు కారణమవుతారు. ఇతరులకు సాయపడటం, సామాజిక సంక్షేమ పనుల్లో మీ శ్రద్ధకు వారు సాయమందిస్తారు. ఊహించని, అవాంఛిత పర్యటనలను మీరు చేపట్టాల్సి రావచ్చు. అది మీ ఆందోళనలను పెంచుతుంది, మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. మీరు ఎక్కడికైనా పర్యటన చేపట్టాల్సి వస్తే దానికి సంబంధించి ముందుగా ప్రణాళిక రూపొందించుకోండి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మీరు మంచి సమతూకం పాటించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మీరు ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు. మీ సమతూకపు నైపుణ్యాన్ని ఈ సంవత్సరం తరచు ఉపయోగించాల్సి రావచ్చు. ఈ సంవత్సరం మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వారు తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉండటం మీకు ఆందోళన కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వారు ఆస్పత్రుల్లో చేరాల్సి కూడా రావచ్చు. ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీరు ఆర్థికంగా కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. మీకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి. సమస్యలు తలెత్తినప్పుడు కుటుంబంలోని పెద్దవారిని సంప్రదించండి. అలా చేయడం వలన మీ పని సులువవడమే కాదు అనవసర ఎదురుదెబ్బల నుంచి మీరు రక్షణ పొందుతారు.

వృశ్చికం 

మీ మనస్సంతా ఆలోచనలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర ప్రారంభం మీకు సాధారణంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు గందరగోళానికి గురవుతారు, ప్రాధాన్యతలను నిర్ణయించుకోలేకపోతారు. పని అవసరాలను మీరు అర్థం చేసుకోవడంతో పాటు జీవితంలోని ఇతర కార్యకలాపాలపై కూడా మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీరు పర్యటన చేపట్టే సూచనలున్నాయి. అయితే ఇవన్నీ దూర ప్రయాణాలు కావు, కాని, ఇవి మీలో ఏడాది పొడవునా ఉత్సాహాన్ని నింపుతాయి. కుటుంబ జీవితంతో మీరు సంతృప్తిగా ఉంటారు. కాని, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే అది మీకు ఆందోళన కలిగిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. మీరు ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కొని ఉంటే ఆ ఫలితం ఈ సంవత్సరం మీకు అనుకూలంగా రావచ్చు. ఈ సంవత్సర ప్రారంభం నుంచి కోర్టు కేసులో మీకు అనుకూలంగా ఉన్నట్టు మీకనిపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లన్నింటినీ మీరు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. తోబుట్టువుల బాధ్యతను మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వారికి మీ అవసరం ఉంటుంది. మార్మిక స్వభావమని మీకు పేరుంటుంది, అది ఈ సంవత్సరం మీకు లాభసాటిగా ఉంటుంది. శత్రువులు, వ్యతిరేకతపై మీరు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు చాలా ఆశాజనకంగా ఉంటారు, ప్రేమిస్తున్న వ్యక్తుల మోముపై చిరునవ్వు చెరగకుండా చూసేందుకు మీరు ఏదైనా చేస్తారు. ఆర్థిక లబ్ది పొందేందుకు మీరు కొత్త ద్వారాలు నిర్మించుకుంటారు. సంవత్సరంలో మధ్య దశ కొంత బలహీనంగా కనిపిస్తున్నా చివరి మూడు నెలలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. మీ చేతిలో ఉన్న అన్ని పనుల్లో మీరు ఈ సమయంలో విజయాన్ని చూస్తారు.

ధనుస్సు 

ఈ సంవత్సరం మీకు సానుకూలంగానే ఉంటుంది. ప్రారంభం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ ధైర్యం, నైపుణ్యం మీకు విజయాన్ని అందిస్తాయి. మీ పోటీదారులు కూడా భయపడతారు. కోర్టు, ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో ఉంటుంది. మీ దృష్టంతా కుటుంబంపైనే ఉంటుంది. మీ కుటుంబ జీవితం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. పెద్దల మార్గదర్శనంతో మీరు మీ పాత పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. దీంతో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అయితే ఈ సంవత్సరం అవకాశం రావచ్చు. దానికి కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. మీ తల్లి తరపు బంధువుల నుంచి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వారితో సఖ్యతగా ఉండటం మంచిది. స్థిరాస్తికి సంబంధించి మీరు లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. మీ కంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి మీరు కొన్ని ప్రయోజనాలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీకు అవసరమైనప్పుడు స్థాయి మేరకు వారు మీకు సాయమందిస్తారు. మీ స్నేహితులు మీకు వెన్నుపోటు పొడవచ్చు. మీకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు మీకు వ్యతిరేకంగా వ్యవహరించే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉంటారు, అది మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ఆధ్యాత్మిక పర్యటనలకు మీరు వెళ్లే సూచనలున్నాయి. ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. కాని స్వల్ప సమస్యలు ఉంటాయి, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మీరు పెద్దవారు ఒకరితో తీవ్రమైన వాదనకు దిగుతారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి, ప్రశాంతంగా ఉండండి. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఈ సంవత్సరం ఆందోళనకు గురిచేస్తుంది.

మకరం 

మొత్తంగా 2021 సంవత్సరం మీకు గొప్పగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటుంది. మీ ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ మీరు చక్కని సాన్నిహిత్యాన్ని చూస్తారు. వ్యాపారపరంగా చూస్తే ఆర్థికంగా ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటుంది. మీ వ్యాపారం పరిఢవిల్లుతుంది. మీ వివాహం విదేశాల్లో జరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా దూరప్రయాణం ఈ సంవత్సరం మీకు కలిసొస్తుంది. మీ కంటే చిన్నవారైన తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు మీకు అండగా ఉంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేలా వారు ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలు, కఠిన శ్రమతో వృత్తిపరంగా మీరు విజయం సాధించే సూచనలు అధికంగా ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన ప్రయోజనాలు కూడా మీరు అందుకుంటారు. దాని కోసం మీరు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇల్లు కొనాలనే ఆలోచనలో మీరు ఉంటే ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. మీ సంతానం కూడా జీవితంలో మంచి పురోగతి చూస్తారు. మీరు విద్యార్థి అయితే కొన్ని ఆటంకాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మీరు వ్యాపారి లేదా ఉద్యోగి అయితే కొత్త విజయశిఖరాలు అందుకుంటారు. మీకు పాత కోరికలు, ఇష్టాలు ఉండవచ్చు, కాని అదే సమయంలో మీరు సంతృప్తిగా ఉంటారు కాబట్టి మీరు మంచి వ్యక్తిగా ఉంటారు. మీరు డబ్బు వెనుక పడకుండా కుటుంబంపై అధిక దృష్టి సారిస్తారు. పేదలకు సాయం చేయాలనే భావన మీలో ఉంటుంది కాబట్టి మీరు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాని వలన మీరు మనశ్శాంతి పొందుతారు. దేవుడిపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులకు సాయపడటం ద్వారా మీరు గౌరవం పొందడమే కాదు అదృష్టాన్ని ఆహ్వానిస్తారు. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు, కాని దాని వలన అహంకారం చోటుచేసుకుంటే అది సమస్యలకు దారితీయవచ్చు.

కుంభం 

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో లోతుగా ఆలోచన చేసే వ్యక్తి మీరు. కాని ఆ నిర్ణయాలను మీరు ఈ సంవత్సరంలో మార్చుకుంటారు. ఈ సమయంలో మీ తెలివితేటలు ఉపయోగించండి. నిర్ణయాలు తీసుకోవడంలో అవి మీకు సాయపడుతాయి. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. ఖర్చులను నియంత్రించుకోలేకపోతే మీరు తీవ్రమైన ఆర్థిక సమస్యల బారిన పడతారు. మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది, కాని పనిభారం కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు. కుటుంబ సౌఖ్యం కోసం మీరు ఆరాటపడతారు, కాని ఒత్తిడి తగ్గించుకునేందుకు పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంవత్సరం మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, వారు మీ బలహీనతలను ఆసరాగా తీసుకుంటారు. ఇది మీ వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమస్యలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం, వ్యాపారపరంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కొత్తగా ఏదో ఒకటి నేర్పుతుంది. ఏదైనా పొందేందుకు మీరు ఏదైనా వదులుకోవాల్సి ఉంటుంది. మీరు ఖ్యాతిని ఆర్జిస్తారు, తత్ఫలితంగా ఉన్నత స్థానాన్ని పొందుతారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ మీరు నెరవేర్చుతారు. ఆర్థికంగా కూడా మీరు వెనకడుగు వేయరు. ఎల్లప్పుడూ వారికి సాయంగా ఉంటారు. ఆ కారణంగా మీరు కుటుంబంలో గౌరవాన్ని అందుకుంటారు, కుటుంబసభ్యులతో మీ బంధం బలోపేతమవుతుంది. మీకు అన్నయ్య ఉంటే మీ సంబంధాల మధ్య చికాకులు చోటుచేసుకోవచ్చు. కాబట్టి మీ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వృత్తిపరంగా మీ సామర్ధ్యానికి తగిన బాధ్యతలు అప్పగించడం లేదనే భావన మీకు కలుగుతుంది. అలాంటి సందర్భాలను అర్థం చేసుకుంటూ సహనంగా వ్యవహరించండి. చాలా సందర్భాల్లో ఇలాంటివాటిలో వాస్తవం కన్నా భ్రమ ఎక్కువుంటుంది. సహనంగా వ్యవహరిస్తూ తప్పుడు, దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని మీరు అడ్డుకోగలరు. విదేశీ పర్యటనకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది.

మీనం 

మీనరాశి వారు భావోద్వేగం కలిగిన సున్నిత మనస్కులు. అదే వారి శక్తి కూడా. కాని కొన్నిసార్లు ఈ భావనలు ఎదురుదెబ్బలుగా మారుతుంటాయి. మీరు ఏదైనా సంబంధంలో ఉన్నా లేదా కొత్తగా ప్రారంభించదలిచినా గుడ్డిగా ఎవరిని నమ్మకండి, లేనిపక్షంలో మీరు కుంగిపోతారు. ఆదాయపరంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరంగా రిస్క్‌ తీసుకునేందుకు మీ ధైర్యం, సామర్ధ్యం మీకు సాయపడతాయి. వ్యాపారంలో విజయం సాధించేలా కొత్త ద్వారాలు తెరిచేందుకు ఈ నైపుణ్యం మీకు ఉపయోగపడుతుంది. స్నేహితుల నుంచి ఈ సంవత్సరం మీరు అద్భుతమైన సహకారాన్ని పొందుతారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. చాలా మంది మిమ్మల్ని అనుసరిస్తారు. మీ కుటుంబజీవితం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ తండ్రి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ కారణంగా ఆరోగ్యపరంగా మీరు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో మీరు మీ పనితో పాటు ఆయనపై కూడా శ్రద్ధ చూపండి. విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటే ఈ సంవత్సరం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఈ విషయం మీ సహనానికి పరీక్షగా మారుతుంది. ఈ సంవత్సరం మీరు మీ తండ్రిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు, ఆయన నుంచి మీరు కొంత ప్రయోజనం కూడా పొందుతారు. ఈ ప్రయోజనం మీరు ఆశించినట్టుగానే ఉంటుంది కాబట్టి అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. 2021లో మీ ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడం మీకు లాభాన్ని చేకూర్చుతుంది. సమాజంలో పేరుగాంచిన వ్యక్తులను మీరు కలుసుకుంటారు, వారి ద్వారా మీరు మరింత అభివృద్ధి చెందుతారు. మీరు విదేశాల నుంచి కొంత లాభాన్ని అందుకుంటారు లేదా విదేశీ ధనం రూపేణా ఆదాయాన్ని ఆర్జిస్తారు. మీ తల్లి మీకు అదృష్టంగా మారుతారు, మీకు కొంత లాభాన్ని అందిస్తారు. వ్యక్తిగత జీవితం కోసం మీ కృషి మిమ్మల్ని ఉన్నత మార్గంలోకి తీసుకెళ్తుంది. పనికి సంబంధించి మీరు స్వతంత్రంగా ఉంటారు, ఎవరిని నమ్మరు. ఇలా చేయడం వలన మీ ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు మీకు కొంత లబ్దిని చేకూర్చుతుంది.

About The Author