రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సూచిక బోర్డ్ లను శుభ్రపరచిన ట్రాఫిక్ సిబ్బంది….
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సూచిక బోర్డ్ లను శుభ్రపరచిన ట్రాఫిక్ సిబ్బంది….
ప్రమాద రహిత రామగుండంగా మార్చడమే పోలీస్ లక్ష్యం.: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు.
32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బి పవర్ హౌస్ గడ్డ నుండి గోదావరి నది బ్రిడ్జ్ వరకు మరియు గోదావరిఖని పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న సూచిక బోర్డు లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలని తీసివేయడం అదేవిదంగా ప్రధాన కూడళ్ల వద్ద గల డివైడర్స్, ట్రాఫిక్ సూచిక బోర్డులను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సిబ్బంది నీళ్ల ట్యాంక్ తెప్పించి శుభ్రపరచడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ…. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ నియమనిబంధనల గురుంచి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తో పాటుగా ప్రమాదాల నివారణ కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దుమ్ము,దూళి ఎక్కువగా ఉండటం వలన ట్రాఫిక్ సూచిక బోర్డు ల మీద దుమ్ము పడి రాత్రి వేళల్లో సరిగా అగుపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నీళ్ల ట్యాంక్ తెప్పించి సిబ్బంది తో కలసి ట్రాఫిక్ సూచిక బోర్డు లను శుభ్రపరచడం జరిగింది.అలాగే సూచిక బోర్డ్ లకు అడ్డుగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను కూడా తీసివేయడం జరిగింది అని తెలిపారు. వాహనదారులు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రమాదాల నివారణ లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు వెంకటేశ్వర్లు, స్వామి, కానిస్టేబుళ్లు అజీజ్,సత్యం, హోంగార్డు శేఖర్ లు మరియు మునిసిపల్,హెచ్.కె.ఆర్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
Ramagundam Police Commissionerate