ఈ పాపకు ఒక్క ఇంజెక్షన్ వేస్తే బ్రతుకుతుంది.. దాని ధర 16 కోట్లు. జబ్బేమిటో తెలుసా..??
మనుషులున్న లోకంకదా ..? మానవత్వం కూడా ఉంటుంది. ఇలాంటి బిడ్డలను కాపాడేందుకు ముందుకొస్తుంది.. ఈ పాపకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదు. దానిని నయం చేసేందుకు ఒక్క ఇంజెక్షన్ చాలు.. కానీ దాని ధరెంతో తెలుసా..? 16 కోట్లరూపాయలు.. ఇంతకీ ఆ జబ్బేమిటో తెలుసా. ? ఎస్ ఏం ఏ టైప్ -1 జబ్బు. ఆ పాప పుట్టిన తర్వాత తల్లిదగ్గర పాలు తాగేసమయంలో ఊపిరాడని పరిస్థితి. ముంబైలోని డాక్టర్లకు చూపిస్తే బాంబు లాంటి నిజం చెప్పారు. మానవుల శరీరంలో ఉండే ఒక జన్యువు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్లు కండరాలు, నరాలు మనుగడ సాగించేందుకు ఉపయోగపడతాయి. అయితే ఆ జన్యువు పాప శరీరంలో లేదు.ఆ జీన్ లేకపోవడంతో ప్రొటీన్లు ఉత్పత్తి కాలేదు. ప్రొటీన్లు లేకపోవడంతో నరాలు, కండలు జీవం లేకుండా మారాయి. మెదడు వరకు వెళ్లే నరాలు కూడా చురుకుగా లేవు. ఇలాగే ఉంటే రెండేళ్ల వయసులోపు పాప చనిపోతుంది. జబ్బు నయంకావాలంటే అమెరికానుంచి ఒక ఇంజెక్షన్ తెప్పించాలి , దాని ఖరీదు 16 కోట్లు అనిచెప్పారు. దీంతో తండ్రి ఆశ వదులుకున్నారు. కానీ తల్లి మనసు ఊరుకోదుకదా ..? అందుకే మార్గం వెదికింది. స్నేహితుల సలహాతో సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ లో సాయం కోరింది. తల్లి ఆవేదన , చిన్నారి ప్రాణాపాయ స్థితికి కరిగిన హృదయాలు తలాకొంత డబ్బుపంపారు , ఇప్పుడది 16 కోట్లు అయింది. పాప కోసం ఇంజెక్షన్ తెప్పించేందుకు హాస్పిటల్ సిద్ధమైంది. మనం ఆర్థికసాయం చేయకపోయినా , పాప ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుందాం .