మదనపల్లి హత్య జరిగిన దాని పై చిన్న కథ…


ఒక డిగ్రీ చేతికి వచ్చి, దానితో పాటు ఒక ఉద్యోగం కాస్త మంచి జీతం
వస్తూ వుంటే ఇహ జ్ఞానమంతా వచ్చేసినట్టు, గొప్పగా ఫీలైపోతూ జీవిస్తున్న విద్యావంతులలో ఎంతటి అవిద్యా, అజ్ఞానం పేరుకుపోయి వున్నాయో ఈ ఆత్మహత్యలు బట్టబయలు చేశాయి.
ఈ డిగ్రీలు వాళ్ళు డాక్టర్లైనా లాయర్లైనా ఇంజీనీర్లైనా..ఎవ్వరైనా ఏమీ తేడా రాదని జీవితంలో ఏదో పనిచేసి డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప, మనం బతకడానికో మరొకరినీ బతికించడానికో కావల్సిన కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా ఇవ్వవనీ తేలిపోయింది.
.
ఆధ్యాత్మికత చైతన్యం, Spirituality అనే మాటలకు కొన్ని వేలమైళ్ళ దూరంలో నిలువెత్తు బుద్ది హీనతతో బుర్రలో పెట్టుకుని బతికేస్తున్న ఈ ”అ”విద్యావంతులను చూస్తుంటే.. ఎంతో ఆవేదన కలుగుతుంది ఎవ్వరికైనా.
ఈ విషయం మాట్లాడుతుంటే ఇదేదో హిందూ మతంలోని మూర్ఖత్వమనీ, దాని పరువుపోతోందనీ, ముగ్గులు వెయ్యడం దగ్గర్నుంచి వారు చేసేవన్నీ చేతబడులేననీ, అసలు హిందూమతమే చాలా చెడ్డదనీ ప్రచారం చేస్తూ తెగ ఆనందపడిపోయే క్రైస్తవ మహమ్మదీయ మతాలవారు కూడా ఈ మూఢత్వాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని వంచిస్తున్నవారే. అరబ్బీ మంత్రాలు అద్భుతంగా పనిచేస్తాయని ఒకడు ఏసురక్తంతో తడిసిన శిలువ తాకితేచాలు దెబ్బకి దెయ్యాలు పారిపోతాయని ఒకరు ప్రచారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. ఇక్కడితో నా పైత్యం ఆపేస్తున్నాను. లాయర్ కళ్యాణ రామారావుగారు రాసిన దానిని చదవి ఆలోచించండి.
.
.
“ఈ వ్యాసాన్ని విశాఖ పట్నంలో వుండే ప్రముఖ లాయర్ Vruddhula Kalyana Rama Rao గారి వ్రాశారు. అన్ని కోణాలను స్పృశించి చాలా చాలా సుస్పష్టంగా నిర్మొహమాటంగా విశ్లేషించారు. వారి పేజీలోంచి నేను ఎత్తుకొచ్చీసినా నా మీద కేసులు పెట్టరనే మొండి ధైర్యంతో ఇలా చేశాను.. – గౌతమ్ కశ్యప్
.
“మదనపల్లి హత్యలు మళ్లీ ‘ఆత్మలు-దెయ్యాలు’ ఉన్నాయనే మూఢనమ్మకాలు ఎంత ప్రమాదమో తెలుపుతూ అవి పోగొట్టే శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచవలసిన అవసరాన్ని మరోసారి తెరమీదకు తీసుకోచ్చేయి.
ఆత్మలు-దెయ్యాలు ఉన్నాయనే మూఢ నమ్మకం పోవడానికి సరైన జ్ఞానం పంచగలిగిన నిజమైన అర్హత ఉన్న వాళ్ళు psychiatrist లూ, psychologist లూ మాత్రమే.
‘జనవిజ్ఞానవేదిక’ లాంటి సంస్థల్లో ఉన్నవాళ్లలో హెచ్చుమందికి ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళలో హెచ్చుమంది బీజేపీ వాళ్ళనీ, హిందూ సమాజాన్నీ, బ్రాహ్మణుల్నీ తిట్టడానికే సమయం వెచ్చిస్తుంటారు. దీనికి ప్రతిగా అవతల వాళ్ళూ తిడుతూ, అవతలి వాళ్ళు మరింత మూఢనమ్మకాలకి మద్దత్తు ఇస్తూ ఉంటారు(అది హిందూ మత సంరక్షణ అనే భ్రమతో). సరే భారత్ లో ఉండే క్రిస్టియన్, ఇస్లాం మతాలు పాటించే వాళ్లలో ఉండే మూఢనమ్మకాల జోలికి వెళితే secularism కి భంగం అని అక్కడికి ఎవరూ వెళ్లేవెళ్ళరు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇప్పుడు psychiatrist లూ, సైకాలజిస్ట్ లలో చాలామందికి ‘ఆత్మలు-దెయ్యాలు’ ఉంటాయనేవి నిజం కాదనీ మూఢనమ్మకం అనీ తెలిసినా అవి ఎందుకు నిజం కావో వివరించి చెప్పగలిగిన జ్ఞానం లేదు.
Personality కి సంబంధించిన కొంత శాస్త్రీయ విజ్ఞానాన్ని వాళ్ళు ఓ 20 ఏళ్ళకిందట పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సిలబస్ లో ఒక్క cognitive behavioural strategy of personality తప్పిస్తే మిగతా personality strategies కి స్థానం లేదు. ఎందుకంటే మిగతా వాటి వల్ల international pharma ఇండస్ట్రీ కి రూపాయి లాభం కూడా లేదు(అసలు CBT కూడ చెప్పకుండా ‘మానసిక రోగాలు-లక్షణాలు-మందులూ’ మాత్రమే సిలబస్ లో ఉంచొచ్చు కాని దానికి మొహమాట పడుతున్నారు).
అందుచేత వాళ్ళలో చాలామందికి వైద్యం చేయడమే వచ్చు కాని healthy personality- sick personality కి సంబంధించిన సైద్ధాంతిక అవగాహన తక్కువ. ‘ఆత్మలూ-దెయ్యాలూ’ లేవని convince చేసే పరిస్థితిలో లేరు.
1992 లో సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పడిపోగానే, ఇండియాలో, ఏవో కొద్ది యూనివర్సిటీ లు మినహాయిస్తే, మిగతావి మార్క్సిజం ను M A (ఫిలాసఫీ) సిలబస్ నుండి తొలగించేయి. వాళ్ళు సిలబస్ లోంచి తీసేసినా ‘తత్వశాస్త్రం’ ఉన్నంత వరకూ ‘మార్క్స్’ ఉంటాడనేది అందరికీ తెలిసున్నదే.
అలాగే, అంతర్జాతీయంగా, సుమారు 1992 ప్రాంతంలోనే , crony capitalism రాగానే, Psychiatry నుండి Psychoanalysis treatment నీ, మిగతా treatment విధానాల్నీ తీసీసేరు. కాని మనస్తత్త్వశాస్త్రం ఉన్నంత కాలం ‘ఫ్రాయిడ్’ ‘Carl Jung’ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆత్మలూ-దెయ్యాల గురించి శాస్త్రీయంగా చెప్పేరు. అవి ఎందుకు మూఢనమ్మకాలో వాళ్ళని చదివితేనే మిగతావాళ్ళకి వివరించొచ్చు. ఇప్పుడు psychiatry, సైకాలజీ సిలబస్ లో ఫ్రాయిడ్, Carl Jung లు just historical reference మాత్రమే.
ఇప్పుడు psychiatrists లు, ఆత్మలున్నాయని-దెయ్యాలున్నాయని నమ్మి క్షుద్రపూజలు పూజలు చేసే రోగులకు, సరైన సమయంలో వాళ్ళు వస్తే treatment ఇవ్వగలరు కాని, ఆత్మలు-దెయ్యాలు లేవు అని జనాలను convince చేసే theoretical knowledge మాత్రం పోగొట్టుకున్నారు. సరే M A సైకాలజీ సిలబస్ లో ఆ జ్ఞానాన్ని ‘అమ్మకానికీ, దోపిడికీ’ ఎలా వాడొచ్చో చెప్పే విషయమే హెచ్చు ఉంది. ‘వ్యాపారానికి’ సైకాలజీ జ్ఞానాన్ని ఎలా వాడొచ్చే చెప్పే సిలబస్ 90 శాతం, అసలు చెప్పవలసింది 10 శాతం.
.
మనం ఏమీ చెయ్యలేం. ఒక పెద్ద ‘అంతర్జాతీయ దోపిడీవ్యవస్థ’ మనకు ఎటువంటి ‘చైతన్యం’ ‘అవగాహన’ కలిగించడానికి పూనుకుందో అంతే ‘చైతన్యం’ ‘అవగాహన’ మనకి దక్కుతుంది.”

About The Author