ఉపనయనం(వడుగు) అనగా…
బ్రాహ్మణులలో వడుగు గురించి.
ఒక సమాజం ఉన్నతి చెందటానినికి అవసరమైన కట్టు బాట్లు , అవసరాలగుంరించి , కొన్ని ఆలోచనలు కలుగుతాయి . అది ఆజాతి తత్వంగా .. తత్వ శాస్త్రంగా రూపొందింది . తత్వ శాస్త్రం అనుసరించి . సమాజం లో ప్రతి ఒక్కరు చేయవలిసిన క్రియా విందానం రూ పొందించ పడుతుంది . మనం చేసినది ఏదైనా దేవుని సమక్షం లో చేసి అయన అశీసులు పొందటం అనే కోరిక అన్ని వర్గాల వారికి ఉంటుంది. దేవుని స్మరించటం , నా ఇంటికి రా అని ఆహ్వానించటం అనేది మంత్రం ( చక్కని అర్ధాలు ఇచ్చే మాటలు .. కోమలంగా వినిపించే మాటలను , సంగీతం లా ధ్వనించే మాటలు ) ద్వారా జరుగుతుంది. ఇది మంత్రం .
బ్రాహ్మణులలో వడుగు గురించి.
బ్రహ్మ స్వరూపులకనుక ( బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వారు ) వేదం విజ్ఞ్యానము , శాస్త్ర జ్ఞ్యానము సంపాదించటం బ్రాహ్మణుని విధి. వాటిని సంపాదించినవారిని గౌరవించటం , క్షత్రియుల ప్రధమ విధి . క్షత్రియులు వేద ధర్మాలని నిలపెట్టటం లేదని పరశు రాముడు వారిని దండించాడు . శ్రీ రాముడు క్షత్రియుడు అయ్యీ , ఆ కాలానికి వ్యతిరేకంగా , వేద ధర్మానికి కట్టు బడి ఉండటం వల్ల, పరశు రాముడు అంతటితో అవతార పరి సమాప్తి చేసాడు .. ఋషులను గౌరవించి వారి శిష్యత్వం స్వీకరించి .. వారికి పాదాభి వందనాలు చేసాడు రాముడు ..
1) క్షత్రియ ప్రభువు చే , గౌర వింప దగిన వాడు , నికార్సు బ్రాహ్మడై ఉండాలి . బ్రాహ్మలు ఎవిరినన్న మోహించి అక్రమ సంతానాన్ని కనే వీలుంది . వారు , బీజ దృష్ట్యా బ్రహమణులే .. వీరిని క్షత్రియులు గురువులుగా అంగీకరించరు ..అలా అని వారిని సూద్రుల కింద చూడలేదు . మంత్రుల గా అంగీకరించారు .
నికార్సు బ్రాహ్మలు .. 8 సంవత్సరంకల్లా వడుగు చేసుకొని వేదఫాఠనం వేపు అడుగులు వేయాలి .
8 వ సంవత్సరాన జరిగిన వడుగు ” పిల్లవాడు ” శుద్ధ బ్రాహ్మడు” అని సమాజానికి చాటుతుంది . ఆ వయసున్న పిల్లలకు వడుగు ముహూర్తం పెట్టిన వారు , వడుగుకు హాజరైన సామాజికులు మొదలగు వారంతా ఆ పిల్లవాడు శుద్ధ బ్రాహ్మడు అని అంగీకరించినట్లు అవుతుంది. బ్రాహ్మణులకు మాత్రమే నేర్పవలిసిన విద్యలున్నవని , భావించిన గురువుకి వీరే బడి పిల్ల కాయలు .
ఈ వేద బ్రాహ్మలు మాత్రమే రాజులు , ఇతరులు నుండి నమస్కారాలు అందుకుని, తిరుగు ఆశీర్వచనం చేస్తారు. . వేదం నేర్చిన వీరే రాజులకు గురువులు . రాజుకు వేరే రాజ్యాంగం అనే పుస్తకం లేదు . బ్రాహ్మణుని నుండి విన్న వేదమే వారి రాజ్యాంగము. అందువల్ల రారాజు లైన సరే వేదాన్ని( రాంజ్యాంగాన్ని) గౌరవించాలంటే .. వేద బ్రాహ్మడిని గౌరవించటమే సరిఅయిన దారి , అని గ్రహించి మసలుకున్నారు .
2) ఎనిమిది – ఆ వయసు దాటినాక ఉపనయనం చేయరాదని ఎక్కడా లేదు . చేయవచ్చు .. కానీ ఆ వయసు దాటినాక పిల్లవాడికి జరిపే ఉపనయనం ..పిల్లవాడు నికార్సు బ్రాక్మాడు కాదని , తండ్రి స్వయంగా అంగీకరించి నట్లు, సామాజికులు అంగీకరించినట్లు అయ్యింది. ఇక పిల్లవాడికి వేద విద్య నేర్చే అధికారం రాదు . గురువులు వేదానికి బదులు , లౌకిక విద్యలు , మంత్రం , తంత్రం, జోస్యం, యుద్హ కళలూ నేర్పేవారు. వీరే రాజులకు మంత్రులు .
మీ పిల్ల వాడు రాజుకు .. గురువుగా ఉండి సంపాదిస్తూ బ్రతికితే హాయా ? మంత్రిగా ఉండి దినదిన గండం నూరేళ్ళ ఆయుశ్యూ” గా బ్రతికితే మంచిదా ?
అందుకని ” బ్రాహ్మణులూ అందరూ ” తమ అందరి పిల్లలకీ” 8 వయస్సుకు వడుగు చేయటం .. తమ జాతి తత్వంగా చేసుకున్నారు .
నేను పైన చెప్పిన విధంగా ..ఈనాటి మనము , 8 వయస్సుకు వడుగు చేసి , వాళ్ళకు వేదం చెప్పించి ” వేద బ్రహ్మలుగా చేసి , సర్వత్రా పూజ్యనీయులుగా చేయించాలన్న ఉద్దేశ్యం లో లేము . ఆలా లేని సమాజంలో వున్నాము .
8 సంవత్సరంలో జరిగే వడుగు సద్బ్రాహ్మణత్వాన్ని చూపిస్తుంది . ఆ తరువాత జరిగే వడుగు కేవలం బ్రాహ్మణత్వాన్ని చూపిస్తుంది . సూద్రత్వాన్ని చూపించదు .
వెలుగు కానిది చీకటి అవనట్లు .. సద్బ్రాహ్మణం కానిది సూద్రమ్ అవదు .
వెలుగు , చీకటి మధ్య సన్నని అంతరం వున్నదని తెలుసు . అలాంటిది లేదని వాదించే వారు వుంటారు . వారి భావనలో లోపం వున్నది అనుకోవాలి కానీ , బ్రాహ్మడు సూద్రుడిగా మారడు. ఏనాడన్న , మనలో కన్నా తల్లి రక్తం పోయి , రోజూ పాలు పట్టి , ఆలనా పాలనా చూచిన పనిమనిషి రక్త్రం అయ్యిందా ?
8 సంవత్సరాల తరువాత వడుగు చేస్తే .. బ్రాహ్మణుడు సూద్రుడు కాదు .. అతని జీవిత ఫందా వేదాల వేపునుండి ఇంకో వేపుకు. మళ్లిస్తున్నాము అంతే .. అని గ్రహించాలి .