శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ…
నెల్లూరు :
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్న మంత్రి నారాయణ
మంత్రి నారాయణ కామెంట్స్ :
శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఉన్న అత్యంత అరుదైన ఆలయం తల్పగిరి రంగనాథస్వామి ఆలయం
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం నదీతీరంలో ఉండడం కూడా మరొక విశేషం
ఒకప్పుడు రంగనాయకుల తిరునాళ్లకు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు
పర్వదినాల్లో పుణ్యస్నానాల కొరకు, హారతులు కొరకు ఘాట్ నిర్మాణం చేపట్టాం
9 కోట్ల రూపాయల క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులతో వంద అడుగుల మేర ఘాట్ నిర్మిస్తున్నాం
మునిసిపల్, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు వస్తాం