లేదు .. రాదు… వర్తిచదు…
Budget ప్రవేశ పెట్టిన ప్రతి సారి… మనకేదో చేస్తున్నారు అనుకోవటం… తుస్సు మనటం ఏటా జరిగే పనే… మొదటి నుంచి ఏపీ అంటే ఎంపీ లను ఉత్పత్తి చేసే ఒక రాష్ట్రం మాత్రమే.. అక్కడ ఏ govt వున్నా… అన్ని పార్టీలు ఎలక్షన్ ముందు వుత్తర ప్రగల్భాలు మాత్రం సూపర్ గా పలుకుతారు… పైన అధికారం లో వున్నా కూడా ఇక ఇక్కడ వున్న వెర్రి పుష్పాలు గురించి చెప్పే పనేలేదు… వాళ్ళు నాయకులు అంటే నవ్వొస్తుంది..
మన దరిద్రం ఏంటంటే … కేసులు, వ్యాపారాలు తో పలచన అయి కేంద్రాన్ని దైర్యం గా మాట్లాడ లేక పోవటంతో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం… ఒక వేళ వినక పోతే పక్కన వున్న తమిళనాడు, కర్ణాటక లో చూసాము మాట వినక పోతే CBI ఎలా పనిచేసింది మనం చూసాము. ఇక మనం ప్రతి ఏటా budget ముందు రోజు రాత్రి కలలు కనాలిసిందే.. మర్చిపోవాల్సిందే….