మరో టాలీవుడ్ హీరో పెళ్లికి రెడీ!
టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ తో సమానంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. హీరోలంతా వరుసపెట్టి తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరుతున్నాడు.
టాలీవుడ్ హీరో, నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మరో 10 రోజుల్లో అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 13న దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు సుమంత్.
స్టార్ ఎట్రాక్షన్ కు దూరంగా, పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరగబోతోంది ఈ వివాహం. కేవలం ఓ 10 మంది టాలీవుడ్ ప్రముఖుల్ని మాత్రం ఎమ్మెస్ రాజు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఇది ప్రేమ వివాహమా లేక ఎమ్మెస్ రాజు కుదిర్చిన సంబంధమా అనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుతం ‘ఇదే మా కథ’ అనే సినిమాలో నటిస్తున్నాడు సుమంత్ అశ్విన్. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరో.. ఈ ‘రోడ్ మూవీ’పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అటు ఎమ్మెస్ రాజు ఈమధ్యే డర్టీ హరి సినిమాతో తొలిసారిగా ఓటీటీ వేదికపైకి వచ్చారు.