సోమనాథ్ ఆలయం ఎన్నిసార్లు పునఃనిర్మించారో మీకు తెలుసా
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని “ప్రభాస తీర్థం” అని కూడా పిలుస్తారు.
భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 వరకు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ లో ఉన్న సోమనాథ్. ఇక్కడున్న సోమనాథ ఆలయం అదేనండి … పురాతన శివుని ఆలయం భారతదేశంలో ఉన్న శివ భక్తులచేత గౌరవించబడుతూ, పూజించబడుతున్నది. సోమనాథ్ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా పేర్కొనటం జరిగింది. ఎన్నో అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సోమనాథ్ క్షేత్ర విశేషాలను గమనిస్తే …
అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు.
ఉత్తర భారతదేశాన ఎక్కువ మంది హిందువులు శివాలయాల్లో దీపాలు వెలుగిస్తూ కనిపిస్తారు ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయితే చెప్పనవసరం లేదు ..! కిక్కిరిసిన భక్తజన సందోహంతో, కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండని విధంగా ఉంటుంది.
ఈ ఆలయం ఎన్నిసార్లు పునఃనిర్మించారో మీకు తెలుసా?
ఈ ఆలయం ఆరుసార్లు పడగొట్టబడి, ఆపై నిర్మించబడింది.
మొదటి సారి
ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలము సాధారాణ యుగము (చరిత్ర ఆరంభానికి ముందుకాలము). రెండవసారి యాదవ రాజైన వల్లభాయి ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీ పూ 649లో పునర్నిర్మించాడని అంచనా. తరువాత క్రీ శ 725లో సింధూ నగర అరబ్ గవర్నర్ (రాజప్రతినిధి) జనయాద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపాడు. క్రీ శ 815లో గుర్జర ప్రతిహరా రాజైన రెండవ నాగబటా ఈ ఆలయాన్ని మూడవమారు ఎర్ర ఇసుక రాళ్ళతో బృహత్తరంగా నిర్మించాడని ఉహించబడుతుంది.
గజనీ మహమ్మద్
క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారి గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసాడు[5][6]. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి మరియు అన్హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్దేవ్ల చేత క్రీ. శ1026 మరియు 1042ల మధ్య ఈ ఆలయ పునర్నర్మాణం జరిగింది. కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీ శ 1143-1172 ల మధ్య పునర్నిర్మించబడింది.
అల్లాయుద్దీన్ ఖిల్జీ
క్రీ శ 1296 ఈ ఆలయం మరొకమారు సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది[5][8]. క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన చుదాసమా వంశీయుడైన మహీపాదావ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. క్రీ శ 1326-1351[8] మధ్య ఈ ఆలయములో లింగ ప్రతిష్ఠ జరిగింది.
గుజరాత్ సుల్తాన్
క్రీ శ1375లో ఈ ఆలయం మరొకమారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫర్ షాహ్ చేత కూల్చబడింది[5][8]. క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్ అయిన ముహమ్మద్ చేత తిరిగి కూల్చబడింది. క్రీ శ 1701లో ఈ ఆలయం మరొక మారు కూల్చబడింది. క్రీ శ 1701లో ఔరంగజేబు చేత ఈ ఆలయాన్ని మరొకమారు ధ్వంసం చేయబడింది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్ళను ఉపయోగించి ఔరంగజేబు మసీదును నిర్మించాడు.
క్రీ.శ 1783లో
తరువాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన ”భోన్స్లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా సమష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.
ఔరంగజేబు
గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో నేలమట్టమయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయి పటేల్ దీనిని తిరిగి నిర్మింపజేశాడు. ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్,డిప్యూటీ ప్రైం మినిస్టర్
స్వాతంత్ర్యం రాక ముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తరువాత అప్పటి ఉపప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబరు 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేసాడు. ఎప్పుడైతే సర్ధార్ పటేలు, కె ఎమ్ మున్షి మరియు ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వము నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చేయవలసినదిగా సలహా ఇచ్చాడు.
సోమనాథ్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
సోమనాథ్ కి 90 కి.మీ. దూరంలో ఉన్న డయ్యు విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ముంబై విమానాశ్రయంచే అనుసంధానించబడింది. డయ్యు నుండి క్యాబ్, ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి చేరుకోవచ్చు.
రైలు మార్గం
సోమనాథ్ కి 5 కి.మీ. దూరంలో ఉన్న వేరవాల్ వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. వేరవాల్ నుండి ముంబై వరకు రైళ్లు అనుసంధానించడం జరిగింది. ముంబై నుండి దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు ప్రయాణించవచ్చు.
రోడ్డు మార్గం
సోమనాథ్ కు రోడ్డు వ్యవస్థ బాగానే ఉంది. డయ్యు నుండి మరియు దగ్గరలోని ఇతర ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేట్ మరియు ప్రభుత్వ రవాణా సాధనాల మీద సోమనాథ్ కు చేరుకోవచ్చు.