స్వార్డ్_ఫిష్ రాకతొ పూర్తిగా మారిపొనున్న భారత ఏయిర్ డిఫెన్స్…


స్వార్డ్_ఫిష్ రాకతొ పూర్తిగా మారిపొనున్న భారత ఏయిర్ డిఫెన్స్

మన చుట్టూ ఉన్న శత్రుదేశాల నుండి మనకు ఆకాశ మార్గం ద్వారా తీవ్రముప్పు ఉన్న సంగతి తెలిసిందే … ఏ ఒక్క బాలిస్టిక్ / కృయిజ్ / ద్రొణ్ / న్యుక్లియర్ మిసైలయినా భారత నగరాలపై దాడిచేసిందంటే ఇక అంతే సంగతులు … దీనిని అధిగమించడం కొసం మోది ప్రభుత్వం గత కొంత కాలంగా శరవేగంగా పనిచేస్తుంది … దీనికొసం ఏ ఒక్క ఏయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టం పై ఆధారపడకుండా, మల్టీ ఏయిర్ డిఫెన్స్ సిస్టం ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకొసం, వీటన్నింటినీ కలిపి ఉంచే సూపర్ ఫవర్ రాడార్ “స్వార్డ్ ఫిష్ రాడార్” వ్యవస్థ ను రంగంలొకి దించుతున్నారు … ప్రస్తుతం తయారీ పూర్తికావచ్చిన ఈ రాడార్ సిస్టం ప్రాజెక్టు ను 2002 లొ అప్పటి ప్రధాని వాజపాయ్ గారు ప్రారంభించారు … అయితే దీనికి సంబందించి 2009 లొ ప్రయొగాలు జరుగగా, అవి అనుకున్నంత సంతృప్తినివ్వలేదు … మోది ప్రభుత్వం వచ్చిన తరువాత, మరలా ఈ ప్రాజెక్టు వేగవంతమైంది … ప్రస్తుతం అభివ్రుధి చేస్తున్న ఈ రాడార్ సిస్టం చివరిదశలొ ఉండటం విశేషం …. ఈ సూపర్ రాడార్ సిస్టం, న్యుక్లియర్ మిసైల్స్ తొ సహా 800 కిలొమీటర్ల పరిధిలొ బయటి నుండి వచ్చే ఏటువంటి ఆజెక్టునైనా గుర్తించి, ట్రాక్ చేసి, వాటిని నూటికి నూరు శాతం అడ్డుకొగలదు … అంతేకాదు ఈ రాడార్ సిస్టం, 15,000 కిలొమీటర్ల వేగంతొ వచ్చే క్రికెట్ బాల్ సైజులొ ఉన్న ఆబ్జెక్ట్ ను కూడా గుర్తించి, అడ్డుకొగల సత్తా ఈ స్వార్డ్ ఫిష్ రాడార్ సిస్టం సొంతం …… Kanna Nagaraju

About The Author