తొలి విడ‌త‌లో.. ఏక‌గ్రీవాల సంఖ్య ఇదే!


ఏపీ పంచాయ‌తీ పోరులో అనేక పంచాయ‌తీ ప్రెసిడెంట్ల ఎన్నిక ఏక‌గ్రీవంగా ముగిసింది. కేవ‌లం ఒకే నామినేష‌న్ దాఖ‌లు అయిన పంచాయతీల ఎన్నిక లాంఛ‌నంగా ముగిసిన‌ట్టే.
నామినేష‌న్ల దాఖ‌లు, నామినేష‌న్ ల విత్ డ్రాల స‌మ‌యం ముగిసిన నేప‌థ్యంలో.. ప‌లు పంచాయ‌తీల్లో ఒకే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో వాటి ఎన్నిక లాంఛ‌నంగా ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నామినేష‌న్ దాఖ‌లు అయిన పంచాయ‌తీల సంఖ్య సుమారు వంద కాగా.. విత్ డ్రా స‌మ‌యంలో భారీ సంఖ్య‌లో ఏక‌గ్రీవాలు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.
ఒకే నామినేష‌న్ దాఖ‌లైన వాటికి తోడు.. పోలింగ్ అవ‌స‌రం లేకుండా ఏక‌గ్రీవాలు అయిన పంచాయ‌తీల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది..

-చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం
-గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం
-కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం
-వైఎస్‌ఆర్‌ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
-పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం
-శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం
-విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం
-తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
-కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం
-ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం
-నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం
-అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం.

About The Author