పెన్నా పవిత్రతను కాపాడాలి..


పెన్నా పవిత్రతను కాపాడాలి.. పెన్నా నది లో వందల పశువుల కళేబరాలనుజేసీబీ తో పూడ్చిన ప్రాంతాన్ని తెలుగు గంగ జల హక్కుల కమిటీ కన్వీనర్ మరియు బిజెపి నాయకులుమిడతల రమేష్ పరిశీలించారు.. పెన్నాలో కలేబరల కాలుష్యంలో నీటిపారుదల మరియు మ్యూనిసిపాల శేఖల నిర్లక్ష్యం క్షనిపిస్తుంది.పెన్నా కాలుష్యాన్ని కి ప్రభుత్వం బాధ్యత వహించలని రమేష్ డిమాండ్ చేశారు. పెన్నా నది లో బర్రెలు ఆవుల కళేబరాలను వ్యర్థాలను నదిప్రాంతాల్లో ఉంచడం అక్కడ నుండి మాంసాన్ని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని ఈ పశువు మాంస విక్రయాలపై ఉన్నతస్థాయి అధికారులు విచారణ జరపాలనిరమేష్ డిమాండ్ చేశారు . ఇక్కడ నుండి మాంసము ఇతర రాష్ట్రలకు ఎగుమతి జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిరవధికంగా పెన్నా నది లో కళేబరాల నుండి మాంసాన్ని వేరుచేసే ప్రక్రియ కొనసాగుతోందని సంబంధితఅధికారులు ఎవరు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. మృత పశువుల మాంసాన్ని ఎవరికి ఎగుమతి చేస్తున్నారు అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని రమేష్ డిమాండ్ చేశారు ..మాంసాన్ని తీసుకున్న ప్రజలు గూడా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వెంటనే పెన్నా నది పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో బాలాజీ నాయుడు.భీమన శ్యాంబాబు.మువ్వలరాంబాబు లు పాల్గొన్నారు.

About The Author