ఇక వారానికి నాలుగే పనిరోజులు!


కేంద్ర కార్మిక, ఉద్యోగిత మంత్రిత్వ శాఖ త్వరలోనే కార్మికులకు శుభవార్త చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. వారికోసం నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లను తీసుకు రావడానికి దాదాపు రంగం సిద్ధమైంది. దీని ప్రకారం వారానికి నాలుగు పనిరోజులతో పాటు, వారంలో 48 పనిగంటలు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు తెచ్చినట్లు ఆశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. దీని వలన కార్మికుల పనిలో నాణ్యత పెరుగుతోందని అన్నారు.కాగా రోజుకు 12 గంటల పనితోపాటు, మూడురోజులు వేతనంతో కూడిన సెలవుల అంశాన్ని కార్మిక సంఘావారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని దానిని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. కంపెనీలలో సాధారణంగా వారానికి గరిష్టంగా 48 గంటల పనివేళలు ఉంటాయి. రోజుకు 8 గంటలుపనిచేస్తే, వారానికి 6 పని రోజులుగా ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులతో రోజుకు 12 గంటల పనిని చేయించుకుంటే, వారానికి నాలుగు పనిదినాలు, మిగతామూడు రోజులు సెలవు రోజులుగా ఉంటాయని చంద్ర ఇంటర్య్వూలో తెలిపారు.

About The Author