ఇస్రో చైర్మన్ పై విజిలెన్స్ కేసు…


ఇస్రో చైర్మన్‌, భారత అంతరిక్ష విభాగం (డీవోఎస్‌) కార్యదర్శి కే శివన్‌ తన కుమారుడు సిద్ధార్థను నిబంధనలకు విరుద్ధంగా ఇస్రోలో నియమించారన్న ఆరోపణలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఫిర్యాదు నమోదు చేసింది.

గత నెల 14న కే శివన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.

అయితే, జనవరి 14కు కొన్నిరోజుల ముందు సిద్ధార్థకు ఇస్రోకు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్సీ)లో ఉద్యోగం లభించింది.

నిబంధనల ప్రకారం ఇస్రోలో ఒక ఉద్యోగిని నియమించాలంటే స్క్రీనింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించాలని, కానీ సిద్ధార్థకు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇచ్చారని ఇస్రో ఉద్యోగి నారాయణన్‌ సీవీసీకి ఫిర్యాదు చేశారు.

About The Author