కుర్రకారు గుండెల్లో హిమాలయన్ బుల్లెట్ దిగింది..


రాయల్ ఎన్‌ఫీల్డ్.. డుగుడుగు బండి..
ఇప్పుడెలా మారిందో చూశారా.. రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది. తాజాగా ఈ 2021లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ బైక్ మార్కెట్లోకి వచ్చేసింది. నేటితరం కుర్రకారును ఆకట్టుకునేలా ఈ బైక్ తయారు చేశారు. ప్రధానంగా లాంగ్ డ్రైవ్ లకు వెళ్లేవారికోసం ఈ బైక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గతంలో ఉన్న హిమాలయన్ బైక్ కు కొన్ని మార్పులు చేసి.. రైడర్ల ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బైక్ ను డిజైన్ చేసినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అడ్వెంచర్ బైక్ గా పిలవబడే ఈ బైక్ ధర దాదాపుగా 2 లక్షలకు పై మాటే.. ధర విషయం అటుంచితే.. ఈ బైక్ లో ఉన్న ఫీచర్స్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోకతప్పదు.హిమాలయన్ బైక్ 411 సిసి, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. హిమాలయన్ మోటారు సైకిల్ గరిష్టంగా 24.83 పిఎస్, 32 ఎన్ఎమ్ పీక్ టార్క్ శక్తిని అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేయబడింది. హిమాలయన్ బైక్ లో ప్రధానంగా టర్న్-బై-టర్న్ వివరించే నావిగేషన్ పాడ్‌ ను అమర్చారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు దీన్ని జత చేయవచ్చు. హిమాలయన్ లో రైడర్ కు సౌకర్యంగా ఉండేందుకు అప్‌డేటెడ్ సీట్లను అమర్చారు. రియర్ క్యారియర్, ఫ్రంట్ సైడ్ లో కొత్త విండ్‌స్క్రీన్ కూడా అమర్చారు. లగేజ్‌ కోసం ఎక్కువ స్థలం ఉండేలా హిమాలయన్ ను డిజైన్ చేశారు. వెనుక వైపున 7 కేజీల బరువును మోయగలిగేలా క్యారియర్ కూడా ఇచ్చారు. హిమాలయన్ బైక్ లో ప్రధానంగా టర్న్-బై-టర్న్ వివరించే నావిగేషన్ పాడ్‌ ను అమర్చారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు దీన్ని జత చేయవచ్చు. హిమాలయన్ లో రైడర్ కు సౌకర్యంగా ఉండేందుకు అప్‌డేటెడ్ సీట్లను అమర్చారు. రియర్ క్యారియర్, ఫ్రంట్ సైడ్ లో కొత్త విండ్‌స్క్రీన్ కూడా అమర్చారు. లగేజ్‌ కోసం ఎక్కువ స్థలం ఉండేలా హిమాలయన్ ను డిజైన్ చేశారు. వెనుక వైపున 7 కేజీల బరువును మోయగలిగేలా క్యారియర్ కూడా ఇచ్చారు. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మొత్తం 4 కొత్త రంగులలో లభిస్తోంది. గ్రానైట్ బ్లాక్, మిరేజ్ సిల్వర్, పైన్ గ్రీన్, రాక్ రెడ్.అయితే హిమాలయన్ ను మనకు నచ్చిన విధంగా డిజైన్ కస్టమైజ్‌ కూడా చేయించు కోవచ్చు. హిమాలయన్ కు ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. టెస్ట్ రైడ్‌ల కోసం ఈ బైక్ లను అందుబాటులో ఉంచారు. లాంగ్ డ్రైవ్ లకు వెళ్లాలనుకునే వారు.. ఎటువంటి క్లిష్టమైన రోడ్లలో అయినా.. వాహనం నడపాలనుకునేవారికి ఈ హిమాలయన్ ఒక చక్కని ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఇంకెందుకు ఆలస్యం రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూంకు బయలుదేరండి..

About The Author