అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ???


అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ???

సహజంగా ప్రత్యేక హోదా లేని రాస్ట్రాలకు కేంద్రప్రభుత్వం, ఆయా కేంద్రపధకాలకు సంబందించి 60% నిధులను ఇస్తుంది. మిగిలిన 40% నిధులు ఆ రాస్ట్రాలే భరించాలి …. అదే ప్రత్యేక హోదా ఉన్న రాస్ట్రాలకయితే, కేంద్రప్రభుత్వం ఆయా కేంద్రపధకాలకు సంబందించి 90% నిధులు ఇస్తుంది. మిగిలిన 10% నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాస్ట్రాలు భరిస్థాయి. అంటే ప్రత్యేక హొదా అంటే ఆర్ధిక వెసులుబాటు కల్పించడం. ఇప్పుడు మోది ప్రభుత్వం ఖచ్చితంగా అదే పని చేస్తుంది. ఆంద్రప్రదేశ్ కు సంబందించిన కేంద్రపధకాలకు 90% నిధులను కేంద్రమే ఇస్తుంది. అయితే ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే, అర్ధికంగా వెనుకబడిన మరొక ఏడు రాస్ట్రాలు తమకు కూడా ప్రత్యేక హోదా కావాలని అడగటానికి సిద్దంగా ఉన్నాయి. అందుకే టెక్నికల్ మాత్రమే ప్రత్యేక హోదా పదాన్ని మోది ప్రభుత్వం ఉపయొగించడంలేదు. ఇక్కడ మరొక విషయమేమిటంటే ప్రత్యేక హొదాకు, ప్రత్యేక పారిశ్రామిక హోదాకు సంబందమే లేదు.

కాని ఈ విషయాలన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం, కాంగ్రెస్, యెల్లొ మీడియా, స్వయం ప్రకటిత మేధావులు ఉదేశ్యపూర్వకంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు …..

About The Author