కన్న కూతుళ్లపై తండ్రి అత్యాచారం చేస్తుంటే, సహకరించిన తల్లి..
కన్న కూతుళ్లపై తండ్రి అత్యాచారం చేస్తుంటే, సహకరించిన తల్లి.. ఏమితెలియని వయసులో తండ్రి కామకోరల్లో చిక్కిన బిడ్డలకు అదేమీ తప్పు కాదని నూరిపోసి ఆ నీచురాలిని తల్లి అనాలో , లేదా ఇంకేదైనా కొత్తపదం వెదకాలో తెలియని పరిస్థితి. తండ్రి కామానికి బలైన కూతుళ్ళకు గర్భం వస్తే , గర్భం పోగొట్టేందుకు మాత్రలు ఇచ్చింది ఆ కసాయి తల్లి. వీలున్నప్పుడల్లా కూతురుకు ఇవ్వమని భర్తకు గర్భనిరోధక మాత్రలు , కండోమ్ లు సప్ప్లై చేసేది. మామూలుగా అయితే ఇలాంటివి చెపితే నమ్మడానికి మనసొప్పదు. అసలు ఇలాంటి తల్లులు ఉంటారా అన్న సందేహం రాక మానదు. అయితే ఇది నూటికి నూరుపాళ్లు నిజం. లక్నో శివార్లలో చిన్నత్ అనే ప్రాంతంలో 44 ఏళ్ళ వ్యక్తి 21 ఏళ్ళ కూతురిపై 12 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఊహతెలియని వయసునుంచే తండ్రి కామకోరలకు చిక్కింది. తల్లికూడా ప్రోత్సహించేది. అదేమీ తప్పుకాదని నూరిపోసేది. ఇంట్లో మరో చెల్లి , ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికీ ఈ దారుణంగురించి తెలుసు. అయితే ఇటీవలే 11 ఏళ్ళ చెల్లి రజస్వల అయింది. ఆ తరువాత నుంచే రెండో అమ్మాయిపై కూడా ఆ కామాంధ తండ్రి కన్ను పడింది. ఆ బిడ్డను కూడా చెరిచేందుకు ప్రయత్నం చేసాడు. పసిపాప ప్రతిఘటించింది . అయితే తల్లి అదేమీ తప్పుకాదని కూతురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. తండ్రితో పడుకోమని ఇబ్బందిపెట్టేది. కొట్టేది . తిండిపెట్టకుండా నరకయాతన చూపించేది. ఇదిలా జరుగుతుండగానే తండ్రి చేతిలో జీవితం నాశనం చేసుకున్న పెద్దకూతురు తెగించేసింది . చెల్లి జీవితంకోసం పోలీసులవద్దకెళ్లి తమ ఇంట్లో జరుగుతున్న దారుణాన్ని చెప్పేసింది. ఈ దారుణం వింటుంటే పోలీసు అధికారి పెద్దగా ఏడ్చేశాడు. దీంతో పోలీసు రంగంలోకి దిగింది. తండ్రి పరారయ్యాడు. తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు , చిన్నారిని బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాముక తండ్రిపై పోక్స్లో చట్టంకింద కేసు పెట్టారు..