ప్రయాణికులకు శుభవార్త మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్ చార్జీ,మంత్రి నితిన్‌ గడ్కరీ


జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్‌ నుంచి దిగిపోయిన పాయింట్‌ వరకు ప్రయాణించిన మేరే టోల్‌ చార్జీలను ఇందులో చెల్లించవచ్చని అన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ. 20 వేల కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ. 10వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే టోల్‌ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ప్రారంభించారు

About The Author